Movies

ప్రభాస్ సాహూ బైక్ ధర తెలిస్తే షాకవుతారు

ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి సినిమా వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమా స్టామినా ఏమిటో రుజువుచేసింది. ఇండియాలోనే కాదు,జపాన్,చైనా వంటి దేశాల్లో సైతం అమాంతం ఇమేజ్ పెరిగిపోయింది. ఇక బాహుబలిగా ప్రభాస్ చేసిన నటనకు వరల్డ్ వైడ్ గుర్తింపు లభించింది. ఇక బాహుబలి సినిమాతో ఏర్పడిన భారీ అంచనాలకు తగ్గట్టు తన తర్వాత సినిమా సాహు కూడా ఉండేలా చూసుకున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ శ్రద్ధా కపూర్,అందిరా బేడీ, ముఖేష్,జాకీష్రాఫ్,తదితరులు నటితున్నారు. హాలీవుడ్ స్టాండర్డ్స్ కి అనుగుణంగా యాక్షన్ త్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా 300కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ పెట్టారు. దుబాయ్ లో చిత్రీకరించిన ఫైట్ సీక్వెన్స్ కోసం దాదాపు వందకోట్లు వెచ్చించినట్లు చెబుతున్నారు. ఇక ఇంటర్వెల్ సీన్ కోసం 30కోట్లు పెట్టారట.

ఇందులో ప్రభాస్ కోసం వాడుతున్న బైక్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. దుబాయ్ లో గత ఏడాది షూట్ చేసిన ఫైట్స్ నేపథ్యంలో ప్రభాస్ కోసం ట్రెంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ఎస్ అనే బైక్ ని వాడారు. ఇక ఈ బైక్ గురించి ప్రభాస్ ఫాన్స్ గూగుల్ లో విస్తృతంగా సెర్చ్ చేసారు. హాలీవుడ్ లో ఫైట్స్ కి ఈ బైక్ ని వినియోగిస్తుంటారు. అయితే అనేక సాంకేతిక మార్పులతో ఈ బైక్ ని తాజాగా మార్కెట్ లో ప్రవేశపెట్టారు. 765సిసి,సిలిండర్ ఇంజన్ ద్వారా ఈ బైక్ కి పవర్ సప్లై అవుతుంది. 121బిహెచ్ పి, 12700ఆర్పీఎమ్, 77ఎం ఎం,పీక్ స్టార్ తో 10800ఆర్పీఎమ్ ఈ బైక్ స్పెషాల్టీస్. ఇక ఈ బైక్ ధర కూడా ఎక్కువే. అందుకే దీనిగురించి ఇప్పుడు విపరీతంగా చర్చ నడుస్తోంది.

టాప్ మోడల్ ధర 10.55లక్షలట. ఎందుకంటే ధరకు తగ్గ క్రేజ్ మార్కెట్ లో ఈ బైక్ సొంతం చేసుకుంది. హాలీవుడ్,బాలీవుడ్ మూవీస్ లో వినియోగించిన ఈ బైక్ ఇప్పుడు టాలీవుడ్ లో వాడారు. మిషన్ ఇంపాజిబుల్ టు హాలీవుడ్ మూవీలో ఈ బైక్ వినియోగించారు. అలాగే లండన్ హాస్పల్ అనే మూవీలో చేజింగ్ కోసం ఈ బైక్ ఉపయోగించారు. అయితే సాహులో వినియోగించిన ఈ బైక్ పై మోజు పడిన ప్రభాస్ ఇప్పుడు సొంతానికి వాడుతున్నాడట. అలాగే బైక్ తో పాటు సాహులో వాడిన కారుని కూడా ఇంటికి తీసుకొచ్చాడని అంటున్నారు.