Devotional

గడపకి పసుపు రాయడం వెనుక గల కారణం ఏమిటో తెలుసా?

సాధారణంగా ఒక ఊరిలో జనాభా గురించి తెలుసుకోవలసి వచ్చినప్పుడు ఆ ఊరిలో ఎన్ని గడపలు వున్నాయనే ప్రస్తావన రావడం మనం తరచుగా చూస్తూనే వుంటాం. అంటే గడపలేని ఇల్లు ఉండదని మనకి ఈ విషయం తెలియజేస్తుంది. మన పూర్వికులు భూమికి, ఆకాశానికి మధ్య హద్దుగా గడపను భావించారు.గడప శ్రీ మహాలక్ష్మీ స్థానం అందుకనే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉండటం మనకు అనాదిగా ఆచారంగా వస్తోంది. ఇక ఈ పని చేయకుండా ఏ ఇంట్లోను ఏ శుభకార్యం గానీ, పూజా కార్యక్రమంగాని జరగదు.

గడపను అమ్మవారి స్థానంగా భావిస్తోన్న కారణంగానే గడపను తొక్కడాన్ని,గడపపై నిలబడి తుమ్మడాన్ని తప్పుగా భావిస్తుంటారు. గడపకి పసుపు రాయడం వెనుక గల కారణాల్లో ఒకటి పవిత్రత అయితే, రెండవది ప్రాణరక్షణ అని చెప్ప వచ్చు.

సాధారణంగా పల్లెటూళ్లు పంటపొలాల మధ్యలోనో, అడవులకు సమీపంలోనో ఉంటూ వుంటాయి. ఈ కారణంగా ఇళ్లలోకి పాములు, తేళ్లు వంటి విష జంతువులు వస్తూ వుంటాయి. ఇవి పసుపు ఘాటును భరించలేవు కనుక ఆ దరిదాపుల్లోకి రాలేవు. అందువల్లనే గడపలకి పసుపు రాయడం ఆనవాయతీగా వచ్చిందని అంటుంటారు.
https://www.chaipakodi.com/