డైరెక్టర్ శివ నిర్వాణ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి…. సినిమాల్లోకి రావటానికి అసలు కారణం….???

నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన 2017లో నిన్ను కోరి తెలుగు ప్రేమకథా చిత్రంతో హిట్ కొట్టి న డైరెక్టర్ శివ నిర్వాణ తాజగా, అక్కినేని నాగచైతన్య,సమంత జంటగా మజిలీ మూవీ తో హిట్ అందుకున్నాడు. లెక్చరర్ గా పనిచేసే శివ నిర్వాణ సినిమాల్లో సక్సెస్ అయ్యాడు. నిన్ను కోరి మూవీని డివివి దానయ్య నిర్మించారు. తను ప్రాణంగా ప్రేమించే అమ్మాయిని వేరే వాళ్ళ భార్య గా చూపించి హిట్ అందుకున్నాడు. ఈవిధంగా ప్రేమలో విఫలమయిన ఘటనతో శివ  నిర్వాణ హిట్ అందుకున్నాడు. విశాఖ జిల్లా సబ్బవరం గ్రామానికి చెందిన ముత్యం నాయుడు , రామలక్ష్మి దంపతులకు జన్మించాడు.

తండ్రి వ్యవసాయం, వ్యాపారం చేసేవాడు. తల్లి గృహిణి. శివకు విజయ్ అనే బ్రదర్ ఉన్నాడు. సొంతూళ్లో పదవతరగతి చదువుకున్న శివ ఇంటర్ వైజాగ్ బైపీసీ గ్రూప్ పూర్తిచేసాడు. అనకాపల్లిలో డిగ్రీ చేసి, తర్వాత బిఇడి పూర్తిచేసాడు. దూరవిద్యలో పిజి చేసాడు. శివ చిన్నప్పటినుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. మహాశివరాత్రి,వినాయక చవితి వేడుకలకు టివిలో విసిపి ల ద్వారా సినిమాలు ఫ్రెండ్స్ తో కల్సి వేసేవారు. ఇక ఇంటర్ చదివేటప్పుడు మధ్యాహ్నం ఒంటిగంటకు కాలేజీ ముగియడంతో మాట్ని చూసేవాడట. 1997లో ప్రేమించుకుందాం రా మూవీని థియేటర్ లో మొదటిసారి చూశాడట.

తర్వాత హాలీవుడ్ , బాలీవుడ్ సినిమాలు కూడా చూసేవాడట. 1998లో వచ్చిన సత్య మూవీ చాలా బాగా అతడికి  నచ్చేసిందట. సినిమా టెక్నీకల్ టీమ్ ఎవరో అబ్జర్వ్ చేయడంతో మెల్లిగా సినిమాల్లోకి వెళ్లాలన్న ఆలోచన వచ్చిందట. డిగ్రీ పూర్తయ్యాక చదివింది చాలు సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ఫ్రెండ్ సుందర రామ్, తమ్ముడు విజయ్ ఎంకరేజ్ చేసారు. మణిరత్నం దగ్గర చేరితే డైరెక్టర్ కావచ్చన్న నమ్మకంతో ఇంట్లో చెప్పా పెట్టకుండా చెన్నై వచ్చేసాడట. అయితే మణిరత్నం ఆఫీసు గేటు దాటి వెళ్లడమే కష్టంగా మారడంతో ఐదు రోజులు ట్రైచేసాడట.

ఈలోగా తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. ఇంతలో ఇంట్లో వాళ్ళు వెతుకుతున్నారని తెల్సి ఇంటికి వచ్చేసాడు. కొన్నాళ్ల తర్వాత సినిమాల్లోకి వెళ్లాలని చెప్పడంతోముందు స్టడీస్ పూర్తిచేసి అప్పుడు వెళ్తే వెళ్ళు అనడంతో శివ ముందుగా 9నెలల్లో బిఇడి చేసి,వైజాగ్ భాష్యం స్కూల్లోసైన్స్ మాస్టర్ గా చేరి,దూరవిద్యలో పిజి చేసాడు. ఇక సినిమా కలను నిజం చేసుకోడానికి 2005లో హైదరాబాద్ వచ్చాడు. డైరెక్ట ర్ పరశురామ్ దగ్గర చేరాలని చూస్తే అప్పటికే చాలామంది ఉండడంతో మిగిలిన వాళ్ళ దగ్గరకు వెళ్లినా రేపు మాపు అంటూ అనేవారట.

ఇలా ప్రయత్నం చేసే సమయంలో డైరెక్టర్ విఎన్ ఆదిత్య దగ్గర మనసు మాట వినదు మూవీకి అసిస్టెంట్ గా చేసాడు. ఒకసారి కథ చెప్పడానికి రామ్ గోపాల్ వర్మ దగ్గరకు వెళ్లడంతో రక్త చరిత్ర సినిమా షూటింగ్ పరిశీలించే ఛాన్స్ మాత్రం ఇచ్చారట. ఇక పరశురామ్ దగ్గర సోలో, సారొచ్చారు మూవీస్ కి పనిచేసాడు. ఇక సొంతంగా డైరెక్టర్ అవ్వాలని చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో ఫ్రెండ్స్ సాయంతో 2014లో వన్ మోర్ స్మైల్,లవ్ ఆల్జీబ్రా అనే రెండు షార్ట్ ఫిలిమ్స్ తీయడంతో బాగా వ్యూస్ వచ్చాయి. ఇక కోన వెంకట్ ని కల్సి ఓ కథ చెప్పడంతో ఆయన సినిమా తీయడానికి ఒకే చెప్పడంతో నిన్ను కోరి మూవీగా వచ్చింది.

డివివి దానయ్య నిర్మాణంలో ఈ సినిమా వచ్చి, బ్లాక్ బస్టర్ అయింది. మూడు నెలలపాటు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుని మళ్ళీ కొన్ని కథలతో వచ్చాడు. సరిగ్గా నాగచైతన్యను కల్సి కథ చెప్పడంతో ఆవిధంగా సమంత, చైతు జంటగా మజిలీ రూపుదిద్దుకుని,ఏప్రియల్ 5న విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టింది. ఇలా రెండు చిత్రాలతోనే క్రేజ్ తెచ్చేసుకున్నాడు. కాగా జీవితంలో స్థిరపడేవరకూ పెళ్లిచేసుకోకూడని అనుకున్నప్పటికీ నిన్ను కోరి సినిమా సమయంలో భాగ్యశ్రీ అనే అమ్మాయిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు ఉన్నాడు.