MoviesUncategorized

Jersey సినిమాలో నాని కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మూవీ జెర్సీ ఈనెల 19న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. క్రికెటర్ అర్జున్ గా నాని నటిస్తున్న ఈ మూవీని గౌతమ్ డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా చేస్తున్న ఈమూవీ ట్రైలర్ కూడా విడుదలై దుమ్ము రేపుతోంది. శ్రద్ధాతో ప్రేమ, ఆతర్వాత పెళ్లి, కొడుకు కోసం మళ్ళీ బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లోకి ఎంత అయ్యాక ఏం సాధించాడన్నది ఈ మూవీ లో చాలా కొత్తగా డైరెక్టర్ తెరకెక్కించాడు. ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా గల ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ లో దూసుకెళ్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. 

జెర్సీ మూవీలో నానికి కొడుకుగా నటించిన కుర్రాడు ఎవరా అని అందరూ ఆసక్తిగా చర్చించు కుంటున్నారు. ఢిల్లీ లవ్లీ పబ్లిక్ స్కూల్ లో చదువుకుంటున్న ఈ బుడ్డోడు పేరు రోనిత్ కామ్రా. జెర్సీ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు తన నటనతో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. చిన్ని చిన్ని యాడ్స్ చేస్తూ కెరీర్ ని చిన్న వయస్సులోనే ఆరంభించిన మంచి మోడల్ యితడు.

ఆతర్వాత పెద్ద పెద్ద స్టార్స్ తో కల్సి యాడ్స్ లో కూడా నటించాడు. చిన్ననాటి నుంచి వివిధ గెటప్స్ తో ఫేస్ బుక్ లో ఫేమస్ గా మారిన కామ్రా ఆతర్వాత యాడ్స్ లో పాపులర్ గా మారి ఇప్పుడు మూవీస్ లో కూడా నటిస్తూ దుమ్మురేపుతున్నాడు.