Politics

ఎన్నికలు అయిన 6 రోజులకే పవన్ సంచలన నిర్ణయం… ఎవరు ఊహించనిది

ఏపీలో ఎన్నికలు ముగిసాయి. ఏప్రియల్ 11న పోలింగ్ ముగిసినప్పటికీ మే 23న లెక్కింపు వరకూ ఫలితాలకోసం వేచి ఉండాలి. ఈ ఎన్నికల్లో టీడీపీ,వైసిపి మధ్యే తీవ్రమైన పోటీ ఉందని అంటున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో బరిలో దిగిన పవన్ కళ్యాణ్ జనసేన పెద్దగా ప్రభావం చూపలేదన్న మాట వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు ఆరుమాసాల క్రితం గల ఊపు ఎన్నికల నాటికి కనిపించలేదన్న మాట వినిపిస్తోంది. ఇక తాజాగా జనసేనాని తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ అయింది. హైదరాబాద్,విజయవాడ లలో జనసేన లీజుకి తీసుకున్న కార్యాలయాలను మూసివేయడమే ఇందుకు కారణం. హైదరాబాద్ మాదాపూర్ లో జనసేన మెయిన్ కార్యాలయం మినహా మిగిలిన రెండు కార్యాలయాలను మూసి వేయాలని తీసుకున్న నిర్ణయం సంచలనం కల్గించింది.

జనసేన  కార్యాలయం దగ్గర పెట్టిన టు లెట్ బోర్డు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్నికల తర్వాత జనసేన కార్యాలయాల మూసివేత జనసైనికులను గందరగోళంలో పడేస్తోంది. హైదరాబాద్ ఐటి ఏరియాలో గల ఈ కార్యాలయం దగ్గర టులెట్ బోర్డు పెట్టడంతో ఈ దుకాణం బంద్ చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ కార్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన నియమించిన సిబ్బందికి జీతాలు వగైరా చెల్లించి ఆఫీసునీ మూసేసినట్లు చెబుతున్నారు. తగినన్ని సీట్లు రావన్న విషయం అర్ధం కావడంతో ఖర్చులు తగ్గించుకోడానికి పవన్ ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏపీలో జనసేన మనుగడ కష్టమని అర్ధం అవుతోంది. పార్టీ నిర్వహణ అంటే మాటలు కాదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.