Politics

రోడ్డు ప్రమాదంలో మురళీమోహన్ కోడలు

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో సీనియర్ సినీనటుడు మురళీమోహన్ కోడలు మాగంటి రూప గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన మరోకారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రూపకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. సహాయకులు ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. 

మాగంటి రూప తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి మురళీమోహన్ గెలవగా.. ఆయన పోటీకి దూరంగా ఉండటంతో ఆ సీటును ఆయన కోడలికి టీడీపీ అధిష్ఠానం కేటాయించింది. మురళీమోహన్ తల్లి వసుమతిదేవి (100) గురువారం ఉదయం విశాఖపట్నంలో అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె అంత్యక్రియలు ఈరోజు రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నారు. రూప ఆ కార్యక్రమానికి వెళ్తుండగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."