Movies

“ప్రేమించుకుందాం రా” సినిమాలో నటించిన అంజలా జవేరీ ఇప్పుడు ఎక్కడ ఏమి చేస్తుందో తెలుసా?

అంజలా జవేరి 1972లో ఏప్రిల్ 20న ఇంగ్లాండ్ లో జన్మించింది. అంజలాకు ఒక సోదరి, సోదరుడు ఉన్నారు. వీరి తల్లిదండ్రులు సాంప్రదాయ గుజరాతీ కుటుంబానికి చెందినవారు. చిన్నప్పుడు తాను విపరీతంగా అల్లరిచేసేదాన్నని ఒకానొక ఇంటర్వ్యూలో ఈమె చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు, తరచూ కుటుంబంతో ఇండియాను సందర్శించేదట. సినిమాల మీద ఆసక్తితో అంజలా యాక్టింగ్ కి సంబంధించిన కోర్స్ ను కూడా పూర్తిచేసింది.

వినోద్ ఖన్నా అంజలా జవేరిను వెండి తెరకు పరిచయం చేశారు. “హిమాలయ పుత్ర” సినిమాలో ఈమెకు అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం ద్వారానే వినోద్ ఖన్నా కుమారుడు అక్షయ్ ఖన్నా కూడా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమాకు హీరోయిన్ ను ఎంచుకునేందుకు వినోద్ ఖన్నా దాదాపు 2000 మందిని ఆడిషన్ చేశారు. వారిలో అంజలా జవేరీ మొదటి రోజు ఆడిషన్ ఇచ్చిననాడే సెలెక్ట్ అయ్యింది. 


ఐతే, తాను ఈ గ్రూప్ ఆడిషన్ లో సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదని సెలెక్ట్ అవకపోవచ్చని కాస్త టెన్షన్ పడిందట. ఐతే, ఆశ్చర్యకరంగా వినోద్ ఖన్నా ఆమెకు అసలు విషయం చెప్పడంతో ఈమె ఆనందానికి అవధులే లేవు. అంజలా జవేరికు అమితాబ్ బచ్చన్ అంటే విపరీతమైన అభిమానం. తాను అమితాబ్ కు పెద్ద అభిమానినని సమయం దొరికినప్పుడల్లా చెప్పుకొస్తుంది. 

ఈ చిత్రం అంజలా జవేరికు గొప్ప గుర్తింపును తీసుకువచ్చింది. సల్మాన్, కాజల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో అర్భాజ్ ఖాన్ కు జోడీగా అంజలా జవేరి నటించింది. ఈ సినిమా తీసుకువచ్చిన గుర్తింపు ద్వారానే ఈ గుజరాతీ భామకు తెలుగులో పిలుపొచ్చింది. 
వెంకటేష్ సరసన “ప్రేమించుకుందాం రా” చిత్రం ద్వారా తెలుగులో అడుగుపెట్టింది ఈ భామ. కాలేజీ గర్ల్ గా మెప్పించింది. వెంకటేష్ కు జోడీగా సరితూగింది. యూత్ లో అమాంతం క్రేజ్ ను సొంతం చేసుకుంది. 

చిరంజీవితో చూడాలని ఉంది చిత్రంలో అంజలా పాత్రకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. మోనార్క్ తండ్రి బారి నుంచి తప్పించుకుని ప్రేమించినవాడితో జీవితం గడుపుతూ ఒక బిడ్డను కని తండ్రి కర్కశత్వం వలన ప్రాణాలు కోల్పోయిన పాత్రలో అంజలా నటనకు ప్రశంసలు దక్కాయి. కేవలం, గ్లామర్ డాల్ కాదని తాను కూడా నటించగలనని ఈ చిత్రంతో ప్రూవ్ చేసుకుంది. బాలకృష్ణతో “సమరసింహారెడ్డి”:

సమరసింహారెడ్డి సినిమాలో అంజలా నెగటివ్ పాత్రలో కనిపించింది. ఏ పాత్రైనా సరే తాను నటించగలనని మరోసారి ప్రూవ్ చేసింది. అంజలా జవేరీ బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరాను వివాహమాడింది. ఇతను ఎవరో కాదు “జబ్ వుయ్ మెట్” లో కరీనా కపూర్ మనసును విరిచేసిన వ్యక్తి. విలన్ పాత్రలో మెప్పిస్తున్న ఈ నటుడు తాజాగా చిరంజీవి 150వ చిత్రంలో కూడా విలన్ గా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. 

ఈ మధ్యే “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” అనే చిత్రంలో అంజలా గెస్ట్ అపియరెన్స్ ఇచ్చింది. అవకాశాలు వస్తే తాను సపోర్టింగ్ రోల్ కు కూడా సిద్ధమని డైరెక్టర్స్ కు హింట్ కూడా ఇచ్చిందట. మరి ఈ భామకు ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ హిక్సిక్ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలుపుతోంది.