జామ ఆకు గురించి ఈ నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు
జామకాయ అంటే అందరికి ఇష్టమే. జామకాయలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే జామ ఆకులో కూడా చాలా ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అందరికి జామకాయలో ఉన్న ప్రయోజనాలు తెలుసు కానీ జామ ఆకులో ఉండే ప్రయోజనాలు చాలా మందికి తెలియదు. ఇప్పుడు జామ ఆకులో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. జామ ఆకులో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. నిజానికి జామకాయలో కన్నా జామ ఆకులోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెప్పుతున్నారు. జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు,విటమిన్ సి మరియు క్వర్సిటిన్, ఫ్లవనోల్ అనే శరీరానికి అవసరం అయ్యే మంచి ఫ్లెవనాయిడ్స్ సమృద్ధిగా ఉన్నాయి.
జామ ఆకులను ఏ రూపంలో తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం. జామ ఆకులను టీ రూపంలో తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. మరి జామ ఆకుల టీని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. నీటిని మరిగించి, శుభ్రంగా కడిగిన జామ ఆకులను అందులో వేసి మరిగించి చల్లారిస్తే, జామాకుల టీ తయారవుతుంది. ఇలా తయారుచేసిన టీకి పంచదార లేదా తేనె మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఇష్టం అయితే పాలను కూడా కలుపుకోవచ్చు. జామ ఆకులలో కొవ్వు,కేలరీలు తక్కువగా ఉండుట వలన బరువు తగ్గాలని అనుకునేవారికి దివ్య ఔషధంగా చెప్పవచ్చు. జామ ఆకుల రసాన్ని తీసుకోవటం ద్వారా బరువు తగ్గవచ్చు.
జామ ఆకుల రసం లివర్ కి టానిక్ వంటిది. జామ ఆకుల రసాన్ని రెగ్యులర్ గా తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా రక్తంలో కొలస్ట్రాల్ ని తొలగిస్తుంది. జామ ఆకుల టీని రెగ్యులర్ గా త్రాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఇన్సులిన్ ఉత్పత్తి కాకుండా చేసి బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు అజీర్ణం,గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. రెగ్యులర్ గా జామ ఆకుల టీని త్రాగితే జీర్ణ క్రియకు అవసరమయ్యే జీర్ణ రసాల ఉత్పత్తికి సహాయపడుతుంది. జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా బాగా పెరుగుతుంది. దంతాల నొప్పి, గొంతు నొప్పి, చిగుళ్ళ వ్యాధులను నివారించడంలో జామ ఆకులు చాలా సమర్ధవంతంగా సహాయపడుతాయి .