Healthhealth tips in telugu

బొప్పాయి గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు

Papaya Health benefits : మన దేశంలోకి బొప్పాయి (Papaya) 400 సంవత్సరాల  క్రితమే ప్రవేశించింది. మెక్సికో ప్రాంతానికి చెందిన బొప్పాయి అనేక ఇతర ఉష్ణమండలాల్లో ప్రాచుర్యం పొందింది. మనదేశంలో బొప్పాయిని ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్‌, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు.

బొప్పాయి చాలా రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు ఒక బొప్పాయి ముక్కను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బొప్పాయిలో ఫాస్ఫరస్, కాపర్, పొటాషియం, ఐరన్, కేల్షియం, మ్యాంగనీజ్ మరియు మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. అలాగే బొప్పాయిలో  విటమిన్ ఏ, బయో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్మరియు ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటాయి.
gas troble home remedies
బొప్పాయిలో ఉండే షుగర్ ని శరీరం తొందరగా గ్రహిస్తుంది. దాంతో బొప్పాయి తినగానే తక్షణ శక్తి లభిస్తుంది. బొప్పాయిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బొప్పాయిలో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన భోజనం అయ్యాక బొప్పాయి ముక్కను తింటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి.
Benefits of papaya seeds
బొప్పాయిలో పపైన్ మరియు కైమోపపైన్ అనే ఎంజైమ్స్ ఉండుట వలన యాంటీ ఇంఫ్లేమేటరీ ఎఫెక్ట్స్ కలిగి ఉంటుంది. ఈ ఎంజైమ్స్ అనేవి ఆర్తరైటిస్, ఎడెమా వంటి ఇతర ఇంఫ్లేమేషన్స్ ను తగ్గించేందుకు తోడ్పడతాయి. అంతేకాకుండా దీర్ఘ కాలిక వ్యాధుల బారిన పడకుండా  కాపాడుతాయి. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తుంది.
eye sight remedies
బొప్పాయిలో విటమిన్ A సమృద్ధిగా ఉండుట వలన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బొప్పాయి పండు గుజ్జులో విటమిన్ ఏ మరియు విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. బొప్పాయిని తరచుగా తీసుకుంటే జలుబు, ఫ్లూ మరియు ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ ను కలిగించే బాక్టీరియా అలాగే వైరస్ నుండి రక్షణ కలుగుతుంది. బొప్పాయిలో ఉన్న మరో అద్భుతమైన ప్రయోజనం ఏమిటంటే కార్డియోవాస్క్యులార్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

బొప్పాయిలో ఫైబర్, పొటాషియం మరియు విటమిన్ కంటెంట్ లు సమృద్ధిగా ఉండుట వలన గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాక బ్లడ్ సర్క్యూలేషన్ బాగా జరిగేలా చేసి రక్తంలో ఎటువంటి క్లాట్స్ రాకుండా చేస్తుంది. బొప్పాయిలో  ఉండే ఫైబ్రిన్ అనే పదార్థం  బ్లడ్ క్లాట్స్ ని తగ్గించి బ్లడ్ ఫ్లోను మెరుగుపరిచేందుకు తోడ్పడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.