తల్లులే ఈ హీరోయిన్స్ పాలిట విలన్స్….పాపం నరకం చూసారు

మానవ సంబంధాలు క్రమేపి తగ్గిపోతూ ఆర్ధిక బంధాలుగా మారిపోతున్నాయి. కుటుంబ బంధాలు సైతం ఆర్ధిక బంధాలతోనే ముడిపడి వున్నాయి. తల్లైనా ,పెళ్లామైనా తమ్ముడైన ఎవరైనా కానివ్వండి డబ్బే ప్రధానంగా మారిపోయిన రోజులివి. అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా సంపాదనకోసం కూతుళ్ళ మీద దాష్టీకం ప్రదర్శించిన తల్లులున్నారు. ఏ తార చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అనే విధంగా ఉంది. మహానటి సావిత్రి,కాంచన హయాం నుంచీ ఈ దుస్థితి ఉంది.

ఇక ఒకప్పుడు దర్జాగా బతికిన కాంచన తల్లి దండ్రుల కారణంగా ఆస్తులన్నీ కోల్పోయే స్థితికి వచ్చేసింది. సొంతవాళ్లే ద్రోహానికి పాల్పడ్డారని తెల్సి,తట్టుకోలేక, కాంచన ఏళ్లతరబడి అజ్ఞాతంలో గడిపేసింది. తీవ్ర వేదన పడ్డాక చివరికి కొద్దిపాటి ఆస్తి మాత్రమే దక్కింది.

 కాగా అందాల నటి శ్రీదేవి ఆస్తుల వ్యవహారం ఎంతచెప్పినా తక్కువే మరి. ఆమె కష్టపడి సంపాదించిన ఆస్తిలో తనకు వాటా ఉందంటూ ఆమె సోదరి లత వేసిన కేసు శ్రీదేవిని ఎంతగానో కలచి వేసింది. రక్త సంబంధీకులే కాదు,బోనీ కపూర్ కూడా కన్నేశాడు. ఆమె తల్లికి ఆపరేషన్ జరగడం, ఆవిషయంలో తనకు సాయం చేస్తున్నట్లు నటించి దగ్గరైన బోనీని రెండో పెళ్ళివాడని కూడా పెళ్లాడింది. తరవాత ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. అది ఎంతగా అంటే, నెలకు పాతిక లక్షల రూపాయలు వడ్డీ కట్టాల్సిన దుస్థితికి చేరింది. అంతేనా,200కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు వెనుక ఆమె చావు దాగివుందని అంటున్నారు.

ఆమధ్య నటి అంజలి అప్పుడప్పుడే నిలదొక్కుకుంటుంటే , ఆమె కు పిన్నితో ఆర్ధిక వివాదం నెలకొంది. అంజలిని పెంచి,నటిగా చేయడానికి తాను పడ్డ కష్టం చూస్తే,ఆమె సంపాదనలో తనకూ వాటా ఉందని ఆమె పిన్ని అనడం,ఆ వివాదం నుంచి బయట పడ్డానికి ఆమె చేసిన పోరాటం మీడియాలో రచ్చయింది. 

ఇక తాజాగా నటి సంగీతకు ఆమె తల్లికి ఓ ఇంటి వివాదం నడుస్తోంది. తమ తాతల కాలం నాటి ఇల్లు సంగీతది కాదని,అయినా తనను ఇంటినుంచి గెంటేయాలని  చూస్తోందని తల్లి భోరున విలపించడం, దీనిపై సంగీత చేసిన ట్వీట్  కలకలం సృష్టించింది. నటి మంజుల విషయం తీసుకుంటే,కూతురి లవ్ మ్యారేజ్ ఇష్టం లేని మంజుల ఆమె కుమారుణ్ణి తన పెంపకంలో ఉంచుకుంది. దీంతో తల్లీ కూతుళ్ళ గొడవ కోర్టుకి చేరింది.

నటి సౌందర్య 2004నాటి హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైంది. ఆ ప్రమాదంలో సోదరుడు అమరనాధ్ కూడా చనిపోయాడు. అయితే 2003లోనే సౌందర్య తన ఆస్తిపాస్తులను ఫామిలీ మెంబర్స్ కి సమానంగా పంచినట్లు వీలునామా రాసినట్లు ఆమె తల్లి, ఆమె భర్త తెరమీదికి తెచ్చారు. అయితే తమకు రావాల్సిన వాటా రాకుండా చూస్తున్నారని సౌందర్య వదిన తన కుమారుని చేత కోర్టులో కేసు వేయించింది.