Health

కష్టపడకుండా వారం రోజుల్లో పొట్ట తగ్గాలంటే ఇలా చేస్తే సరి

ఇటీవల కాలంలో మారిన జీవనశైలి కారణంగా మనం తినే ఆహారంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. అందువల్ల ఆ ప్రభావం పొట్ట మీద పడి పొట్ట పెరగటానికి కారణం అవుతుంది. పొట్ట పెరగటం వలన మన శరీర ఆకృతి కూడా అసహ్యంగా కనపడుతుంది. అంతేకాకుండా వేసుకున్న దుస్తులు కూడా అందంగా ఉండవు. ఈ పరిస్థితి నుండి బయట పడటానికి ఇప్పుడు చెప్పే చిట్కా బాగా సహాయపడుతుంది. పొట్ట తగ్గటానికి ఒక నేచురల్ డ్రింక్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పొట్ట చాలా ఫాస్ట్ గా తగ్గిపోతుంది. ఈ డ్రింక్ కోసం మనం పుదీనా,నిమ్మరసం,పసుపు ఉపయోగిస్తున్నాం. పుదీనా ఆకులలో ఉండే పోషకాలు,ఔషధ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ కొవ్వును కరిగించటంలో 
బాగా సహాయపడతాయి. 

పుదీనా ఆకులను వంటల్లో రుచి,వాసనకు వాడతారు. అలాగే పుదీనాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పుదీనాలో జీర్ణవ్యవస్థకు సహాయపడే ఎజైమ్స్ అధికంగా ఉండటం వల్ల, ఇవి ఫ్యాట్ ను కరిగించడానికి అవసరమయ్యే శక్తిగా మారుతుంది. ఈ డ్రింక్ కోసం 10 నుంచి 15 వరకు పుదీనా ఆకులను తీసుకోవాలి. పుదీనా ఆకులను మట్టి దుమ్ము,ధూళి లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోని దానిలో పుదీనా ఆకులు వేసి బాగా మరిగించాలి. బాగా మరిగాక ఆ నీటిని వడకట్టి నిమ్మరసం,పసుపు కలిపి ఉదయం బ్రేక్ ఫాస్ట్ ముందు త్రాగాలి. ఇలా పది రోజుల పాటు త్రాగితే క్రమంగా పొట్ట తగ్గిపోతుంది.