రాజశేఖర్ కూతురు సినిమా పరిస్థితి ఏమిటి…. ఆగిపోయిందా?

నటి జీవిత,హీరో రాజశేఖర్ ల ఇద్దరు కుమార్తెలు శివాని,శివాత్మిక. వారిద్దరి ని కూడా వెండితెరకు పరిచయం చేయడానికి గత కొద్దీ కాలంగా మంచి ప్రణాళిక తో ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే వారి పెద్ద కుమార్తె శివాని ని వెండితెరకు పరిచయం చేయడానికి అంతా సిద్ధం కూడా అయిన సంగతి తెలిసిందే. గతేడాది శివాని ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని ప్రారంభించారు. అయితే ఈ చిత్రం ప్రస్తుతం ఆగిపోయినట్లు తెలుస్తుంది. క్షణం,గూఢచారి చిత్రాల కథానాయకుడు అడవి శేషు కు జోడీ గా శివాని ఈ చిత్రంలో నటిస్తున్నారు.

హిందీ చిత్రం ఆయిన్ ‘2 స్టేట్స్’ చిత్రానికి ఇది రీమేక్ గా చెబుతున్నారు. అయితే ఈ చిత్రం కోసం నూతన దర్శకుడు ని ఎన్నుకొని దర్శకత్వ భాద్యతలు అప్పగించారు. కానీ ఈ చిత్రాన్ని తెరకెక్కించే విధానం సరిగా లేదన్న కారణంగా ఈ చిత్రాన్ని నిలిపివేసినట్లు తెలుస్తుంది. దీనితో శివాని తెరంగేట్రం కొంచం ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది.మరోపక్క జీవిత,రాజశేఖర్ ల రెండో కుమార్తె శివాత్మిక కూడా వెండితెరకు పరిచయం కానుంది. అయితే శివాత్మిక చిత్రం దాదాపు పూర్తి అవుతుండగా పెద్ద కుమార్తె శివాని చిత్రం మాత్రం ఆగిపోవడం విశేషం.