Movies

సుమ సంపాద‌న‌పై భ‌ర్త రాజీవ్ షాకింగ్ కామెంట్స్… ఆలా అనేసాడే?

ఏ రంగంలోనైనా కొందరికి బాగా కల్సి వస్తుంది. ఉదాహరణకు క్రికెట్ ప్ర‌పంచంలో ఎంత‌మంది గ్రేట్ బ్యాట్స్ మెన్ ఉన్న క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్క‌ర్ ఒక్క‌డే కదా. అలాగే టీవీ ఇండ‌స్ట్రీలో కూడా ఎంత మంది గొప్ప హోస్టులు, యాంక‌ర్స్ ఉన్నా అంద‌రికీ ఆదిగురువు సుమ క‌న‌కాలే అని చెప్పాలి. దాదాపు రెండు ద‌శాబ్దాలుగా టెలివిజ‌న్ రంగాన్ని మ‌కుటం లేని మ‌హారాణిగా ఏలేస్తుంది. రోజుకో కొత్త యాంక‌ర్ వ‌చ్చి.. గ్లామ‌ర్ షోలు కూడా చేస్తున్న ఈ స‌మ‌యంలో కూడా బుల్లితెరపై ఇంత సుధీర్ఘకాలం కెరీర్ కొనసాగించడం సామాన్య విషయం కానేకాదు. కానీ సుమ చేసి చూపించింది.

పైగా తెలుగమ్మాయి కూడా కాకున్నా, ఎక్క‌డో కేర‌ళ నుంచి ఇక్క‌డికి వ‌చ్చి తెలుగు తెలుగ‌మ్మాయిల కంటే స్ప‌ష్టంగా తెలుగులో దూసుకుపోతోంది. సుమ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో మాత్రం ఎప్పుడూ ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తూనే ఉంటుంది. ఈమె హీరోయిన్ల కంటే ఎక్కువ సంపాదిస్తుంది.. ఎప్పుడు చూడూ షోస్ చేస్తూనే ఉంటుంది.. ఆమె రెమ్యున‌రేష‌న్ ల‌క్ష‌ల్లో.. సంపాద‌న కోట్ల‌లో ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తుంటాయి. అయితే ఇప్పుడు దీనిపై ఆమె భ‌ర్త రాజీవ్ క‌న‌కాల చేసిన కామెంట్స్ సెన్షేషన్ అయ్యాయి. ఆమె విజయం తాను ఉన్నాన‌ని అంతా అనుకుంటారు కానీ అది పూర్తిగా సుమ క‌ష్టార్జితం అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో భార్య గురించి ప్రేక్ష‌కుల‌కు రాజీవ్ చెప్పుకొచ్చాడు.

కేవ‌లం సుమ త‌న ప్రతిభతోనే ఈ స్థాయికి వ‌చ్చింద‌ని, ఆమె క‌ష్టంలో తాను భాగం తీసుకో దలచుకోలేదని అంటుంన్నాడు. దేవదాస్ కనకాల, లక్ష్మీదేవి కనకాల కోడలు కావడంతో ఏమైనా హెల్ప్ అయిందేమో కానీ తాను మాత్రం ఏమీ చేయలేదన్నారు. ఇక సుమ రెమ్యూనరేషన్ విషయంలో కూడా రాజీవ్ చేసిన కామెంట్స్ ఆసక్తి రేపాయి. స్టార్ హీరోయిన్ల‌ను మించి సుమ పారితోషికం తీసుకుంటుంద‌ని ప్ర‌చారం చేయ‌డంలో అర్థం లేద‌ని రాజీవ్ చెబుతున్నాడు. కాక‌పోతే ల‌క్ష‌ల్లో తీసుకుంటుంద‌టారు కానీ ఎన్ని ల‌క్ష‌లు తీసుకుంటుంద‌నేది మాత్రం తెలియ‌దు అంటున్నాడు.

పైగా రోజుకు ఎనిమిది గంట‌లు నిల్చొని, అన్ని లైట్స్ మ‌ధ్య‌లో షోస్ చేయ‌డం అంటే చిన్న విష‌యం కాద‌ని, ఒక్క‌సారి ఆ కష్టం మీరే ఊహించుకోవాలని అన్నాడు. రోజూ మీరు స్పీకర్లు ఆన్ చేసేకుంటే తెలియ‌కుండానే మైండ్‌పై ప్ర‌భావం ప‌డుతుంది.. అవ‌న్నీ భ‌రిస్తూ షో చేయ‌డం అంటే గొప్పే క‌దా అన్నాడు. ఇంత చేసినా కూడా మీరు ఊహించుకునేంత రెమ్యున‌రేష‌న్ ఏముండ‌ద‌ని రాజీవ్ అంటూనే సుమ రెమ్యున‌రేష‌న్ ఎంతో త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పాడు. ఎప్పుడూ త‌న సంపాద‌న గురించి అడ‌గ‌లేద‌ని, ఆమె స్పేస్ ఆమెకే వ‌దిలేస్తానని, ఒక భ‌ర్త‌గా తాను చేయాల్సిన స‌పోర్ట్ చేస్తానే తప్ప ఆమె కెరీర్ విష‌యంలో వేలు పెట్టబోనని ప్రకటించాడు.