Kitchenvantalu

Korra Biyyam Pongal: పిల్లలు ఎంతగానో ఇష్టపడే కొర్ర బియ్యం చెక్కర పొంగలి ఇలా చేయండి

Korra Biyyam Pongal: పిల్లలు ఎంతగానో ఇష్టపడే కొర్ర బియ్యం చెక్కర పొంగలి ఇలా చేయండి..అమ్మవారికి ప్రసాదంగా కూడా పెట్టవచ్చు.

కావాల్సిన పదార్ధాలు
కొర్ర బియ్యం – 1/2కప్పు,పెసరపప్పు – 1/2 కప్పు,నెయ్యి – 4 Spoons,
డ్రై ఫ్రూట్స్ – 1/4 కప్పు,ఇలాచీ పౌడర్ – చిటికెడు,మిల్క్ మెయిడ్ – 200 గ్రాములు

తయారు చేయు విధానం
కొర్ర బియ్యంతో చెక్కర పొంగలి తయారుచేయాలంటే ముందుగా కొర్రబియ్యాన్ని, పెసరపప్పును విడివిడిగా నానబెట్టుకోవాలి. మరో పక్క బాణిలిలో డ్రైఫ్రూట్స్ వేయించడానికి నెయ్యిని వేడి చేసి, వాటిని వేయించాలి. అందులోనే నానిన పెసరపప్పును వేస్తే మంచి వాసన వస్తుంది.

దీనిలో కొన్ని నీళ్లు కలుపుకుని పెసరపప్పును సగం ఉడికించుకోవాలి. అలా సగం ఉడికిన తర్వాత కొర్రబియ్యం వేసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. రెండు పూర్తిగా ఉడికిన తరువత ఇలాచీ పౌడర్, మిల్క్ మెయిడ్ వేసి, నెయ్యిని జోడించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.చాలా రుచిగా ఉండే కొర్రబియ్యం చెక్కర పొంగలి రెడీ అయిపోయినట్లే.