Movies

ఇంతకీ మహర్షి కాలర్ ఎగరేయడం వెనుక కారణం ఏమిటో తెలుసా?

మురారి, ఒక్కడు,పోకిరి,దూకుడు, భరత్ అనే నేను ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నప్పటికీ ఎప్పుడూ కాలర్ ఎగురవేయడం ఎరుగని సూపర్ స్టార్ మహేష్ తాజాగా మహర్షి తర్వాత ఎందుకు కాలర్  ఎగరువేసాడో అర్ధం కావడం లేదట. 25 సినిమాల కెరీర్ లో హిట్లు.. బ్లాక్ బస్టర్లు.. ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. అయితే నేడు మహర్షి సినిమా సక్సెస్ వేడుకలో కాలర్ ఎగురవేసి ఎంతో కాన్ఫిడెంట్ గా మహేష్ మాట్లాడాడాడు. అభిమానులందరినీ ఉత్సాహపరుస్తూ, మీరు గర్వించేలా కాలర్ ఎగురవేస్తాను అన్నాడు. అలా అంటున్నప్పుడు అభిమానుల కోరికను నెరవేరుస్తున్న ఫీలింగ్ మహేష్ లో కనిపించింది. ఇక సూపర్ స్టార్ నటించిన మహర్షి కేవలం తొలి వారంలోనే తన కెరీర్ లో ఉన్న రికార్డులన్నీ చెరిపేస్తుందని ఎంతో కాన్ఫిడెంట్ గా ప్రకటించాడు.“నా పాతిక సినిమాల జ‌ర్నీ ఎంతో ప్ర‌త్యేకం. అందులో మహర్షి సినిమా మ‌రింత ప్ర‌త్యేకం.

మహర్షి మూడేళ్ల ప్రాసెస్‌ లో మ‌ర‌చిపోలేని అనుభ‌వాలున్నాయి. దిల్‌రాజు తొలిసారి క‌థ విని క్లాసిక్ అన్నారు. నాకు ఫోన్ చేశారు. గ‌త ఏడాది ద‌త్తుగారు క‌థ విని ఈ సినిమా ఓ గేమ్ చేంజ‌ర్ అవుతుంది అన్నారు. డ‌బుల్ పాజిటివ్ చూసిన‌ప్పుడు చాలా ఆనందం కలిగింది. నేను క్రికెట్‌కు చాలా పెద్ద ఫ్యాన్‌ని. 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌కు వెళ్లాను. చివ‌ర్లో దోని సిక్స్ కొట్టిన‌ప్పుడు చాలా సంతోష‌ప‌డ్డాను. అప్పుడు ఎంత ఆనందం వేసిందో దిల్‌రాజుగారు సిక్సర్ కొట్టాం అన‌గానే అంతే ఆనందం వేసింది’అని మహేష్ పేర్కొన్నాడు. మూడు పెద్ద బ్యాన‌ర్స్ లో ఈ సినిమా తెరకెక్కడం గ‌ర్వంగా ఉందన్నాడు. సాధార‌ణంగా ద‌త్తుగారు ప్రిన్స్‌ .. బాబు అని పిలుస్తుంటారు. విప‌రీతంగా న‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే మ‌హేష్ అని పిలుస్తారు. అలా ఎప్పుడు పిలుస్తారా? అని ఎదురుచూస్తుంటాను. ఈ సినిమా చూసిన త‌ర్వాత ఆయ‌న అలా పిలిచారు“ అని మహేష్ ఆనందంగా చెప్పుకొచ్చాడు.

ఇప్పటి వరకూ, మహర్షి చిత్రం బాక్సాఫీస్ వద్ద 32 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇంకా 70 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఓవరాల్ గా 100 కోట్లు తెస్తేనే ఈ సినిమా హిట్టయినట్టు. లేదంటే కష్టమే. తొలి మూడు రోజులు ఉన్నంత దూకుడు ఇకపై ఉంటుందా? అంటే కష్టమేనన్న మాట కూడా ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అసలు మహర్షి చిత్రానికి రేపటి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ వారం అంతా వసూళ్లు ఎలా ఉంటాయి ? అన్నదానిని బట్టి ఎంతవరకూ లాగుతుందో చెప్పగల మని అంటున్నారు. కానీ ఇంకా రెండుమూడొంతులు లాగితేనే కానీ మహర్షి హిట్టు అని చెప్పలేని పరిస్థితి. మరోవైపు అశ్వనిదత్, దిల్ రాజు, పీవీపీ తలో 10 కోట్ల డెఫిషిట్ తోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారన్న ప్రచారం సాగింది. అంటే, పూర్తి స్థాయిలో 100 కోట్ల షేర్ వస్తేనే వీళ్లంతా ఊపిరి పీల్చుకునేది. లేదంటే ఎవరు కాలర్ ఎగురవేసినా అది కాస్తా మిస్ ఫైర్ అయినట్టేనని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి మహేష్ చాలా క్యాలిక్యులేషన్స్ తర్వాతనే ఇలా కాలర్ ఎగురవేసారని అర్థమవుతోంది.