గార్లిక్ రైస్

కావాల్సిన పదార్ధాలు
సోనామసూరి బియ్యం- 100గ్రా.,ఆవాలు రెండు టీ స్పూన్లు,శనగపప్పు పది గ్రా,పచ్చిమిర్చి- ఆరు,వెల్లుల్లి-100గ్రా (రేకులను విడదీసి హిట్టు ఒలుచుకోవాలి),కరివేపాకు-50గా,నెయ్యి 50గ్రా,నిమ్మచెక్క ఒకటి,ఎండుమిర్చి రెండు,ఉప్పు తగినంత

తయారు చేయు విధానం

అన్నాన్ని పలుకుగా వండి వెడల్పు పాత్రలో వేసి చల్లారనివ్వాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి కొంత కరివేపాకును వేయించి పక్కన పెట్టాలి. మిగిలిన నేతిలో ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత అందులో వెల్లుల్లి రేకులు వేసి సన్నమంట మీద కొద్ది సెకన్ల పాటు వేగనివ్వాలి.ఇప్పుడు ఉప్పు, అన్నం కలిపి దించేయాలి. చివరగా నిమ్మరసం కలిపి, నేతిలో వేయించిన కరివేపాకుతో గార్నిష్ చేయాలి.