Movies

ఒక్క రోజు పూట గడవడానికి కష్టపడ్డ రక్షా… ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

ఒక్క సినిమాలో నటనతోనే,ఒక్క పాటతోనే జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటారు కొందరు. అందులో నటి రక్షా ఒకరు. ఈమె ప్రేమలేఖ సినిమాలో ‘చిన్నా దాన  ఓ చిన్నా దాన’పాటలో ఒక్కమాట కూడా మాట్లాడకుండా తన బాడీ లాంగ్వేజ్ తో, ఓరచూపులతో కుర్రకారుని కట్టిపడేసింది. తమిళనాట రాణి పేరుతొ నటిగా అవతారం ఎత్తిన ఈమె తెలుగులో రక్షా గా మారింది. నిజానికి తమిళ అమ్మాయిగా కనిపించినా ఈమె అచ్చ తెలుగు అడపడుచే. అనకాపల్లి పక్కన ఓ పల్లెటూరులో వీరి తల్లిదండ్రులు ఉండేవారు. ఎన్టీఆర్, జమున లతో ఓ సినిమా చేయడం కోసం తండ్రి చెన్నై చేరుకోగా, రాణి చెన్నపట్నం చిన్నదిగా మారింది. 7వ తరగతి వరకూ ఆమె చదువుకుంది. ఒక ఆకతాయి వెంబడించడంతో ఇక చదువుకు స్వస్తి చెప్పేసింది. 

ఈలోగా తండ్రి ఆర్ధికంగా చితికిపోవడంతో ఆర్టిస్టుగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఈమె గ్రూప్ డాన్సర్లలో ఒకరుగా చేసింది. తర్వాత చిన్నదానా పాటతో మంచి గుర్తింపు పొందింది. తన చెల్లి భర్త సంపత్ రాజ్ కొరియోగ్రాఫర్ గా ఉండేవాడు. అతడి కొడుకు పుట్టినరోజు సందర్బంగా ఇంటికి డైరెక్టర్ అగస్త్య న్ వచ్చి,రక్షను చూసి, చిన్నదానా పాట ఈమె చేస్తే బాగుంటుదని సూచించాడు. చెల్లెలు కూడా వత్తిడి చేయడంతో ఒప్పుకుని చేయడంతో కెరీర్ కి ఈపాట బాగా ప్లస్ అయిందని రక్షా చెబుతుంది. ఈ పాట చూసాక కృష్ణ,రమేష్ బాబు నటించే అహో విక్రమార్క మూవీలో హీరోయిన్ గా డైరెక్టర్ సాగర్ ఛాన్స్ ఇచ్చారని,అయితే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయిందని రక్షా చెప్పింది. ఇక ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ దృష్టిని ఆకర్షించడంతో హీరోయిన్ గా అవతారం ఎత్తింది. అన్ని భాషల్లో కలిపి 30సినిమాల్లో హీరోగా చేసిన ఈమె ఆతర్వాత క్యారెక్టర్  ఆర్టిస్ట్ గా నిల్చింది. 

ఇక తల్లిదండ్రులు లేకపోవడం తనకు ఎంతో బాధగా ఉంటుందని రక్షా అంటోంది. జగపతి బాబుతో మూవీ చేస్తుండగా,తల్లికి సీరియస్ అని తెలియడంతో వెంటనే వెళ్లానని అయితే అప్పటికే ఆమె మరణించడం కలచివేసిందని అంటోంది. 2007లో నాన్న మరణంతో ఒంటరిగా మిగిలానని అంటోంది. దర్సకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు సినిమా పోలీస్ వెంకటస్వామి సినిమాలో సురేష్ చెల్లెలుగా వేశానని,చిరంజీవి,రజనీకాంత్ మినహా  మిగిలిన అగ్రనటులందరితో చేసానని చెప్పింది. కాగా అందరిలాగా సెకండ్ ఇన్నింగ్స్ నచ్చావులే సినిమాతో రక్షా మొదలుపెట్టింది. రవి బాబు మూవీలో తల్లి క్యారెక్టర్  చేసి నంది అవార్డు దక్కిందని రక్షా గుర్తుచేసుకుంది. తనది లవ్ మేరేజ్ అని చేప్పే రక్షా తన భర్తకు దుబాయిలో హోటల్స్ ఉన్నాయని అంటోంది. తన భర్త ఒప్పుకుంటేనే సినిమాల్లో క్యారెక్టర్స్  వేస్తానని అంటోంది. ఈమె కూతురు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. తాను అందంగా ఉంటానని ఎవరైనా అంటే పర్వాలేదని అయితే తేడాగా ప్రవర్తిస్తే తాట తీస్తానని ఆమె పేర్కొంటూ నలుగురైదుగురికి దెబ్బలు కూడా పడ్డాయని చెప్పింది.