Movies

పేరుకే కమెడియన్స్ నిజ జీవితంలో మాత్రం నవ్వును కోల్పోయారు

తెరమీద నవ్వులు పూయిస్తూ స్టార్ కమెడియన్స్ గా ఎదిగి బాగానే సంపాదించినప్పటికీ నిజ జీవితంలో భార్యలతో కల్సి వైవాహిక జీవితాన్ని మిస్ అయ్యారు. సినిమాల్లో బిజీ కారణంగా ఇంటికి దూరం అవ్వాల్సి వచ్చింది. ఇక భార్యలతో ఏదోఒక గొడవతో నిత్యం రగడ సాగేది. ఒకప్పుడు బాగా బిజీ కమెడియన్ గా గడిపిన వేణు మాధవ్ వరుస సినిమాలతో డబ్బు కూడా బాగానే సంపాదించాడు. అయితే ఇంట్లో భార్యతో తరచూ గొడవ పడుతూ, చివరకు ఇద్దరూ  విడాకులకోసం పిటిషన్ కూడా దాఖలు చేసారు. రంగారెడ్డి కోర్టు విడాకులు మంజూరు చేయగా,భార్య,ఇద్దరు మైనర్ పిల్లలకు పరిహారంగా 60లక్షలు ఇవ్వడానికి ఒప్పందం పడ్డాడు. 

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న పృథ్విరాజ్ పై అతడి భార్య చీటింగ్ కేసు పెట్టి విడాకులు కోరింది. నెలకు 8లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కోరుతూ కోర్టుకి ఎక్కింది. తనకు అంత సంపాదన లేదని,ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి కూడా అంతటి సంపాదన ఉండదని అందుకే అంతమొత్తం ఇచ్చుకోలేనని కోర్టుకి విన్నవించాడు. కాగా కమెడియన్ జోగినాయుడుకి కూడా అదే పరిస్థితి. జోగి బ్రదర్స్ లో ఒకడైన జోగినాయుడు 1995లో యాంకర్ ఝాన్సీతో ప్రేమలో పడ్డాడు. ఇంట్లో చెప్పాపెట్టకుండా జెమిని టివి ఆధ్వర్యంలో ఒకటయ్యారు.

ఇద్దరికీ ఒక పాప పుట్టాక ఇద్దరి మధ్యా వచ్చిన మనస్పర్ధలతో  విడిపోయారు. ఇక మరో కమెడియన్ చిత్రం శీను కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు. చిత్రం మూవీలో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ కమెడియన్ ని శ్రీను వైట్ల లాంటి డైరెక్టర్స్ బాగానే ఎంకరేజ్ చేసారు. టాప్ రేంజ్ లోకి వెళ్తాడనుకున్న అతడికి ఇంట్లో సమస్యలు కొంపముంచాయి. 250సినిమాల్లో నటించిన శీనుకి భార్య పిల్లలున్నారు. అయితే ఏ గొడవలు వచ్చాయో గానీ ఓ డాన్సర్ తో సంబంధం పెట్టుకుని, ఆమెను పెళ్లాడాడు. మొదటి భార్యకు విషయం తెల్సి విడాకులు తీసుకుని కేసు పెట్టింది. ఈ కేసు పెండింగ్ లో ఉండడంతో అతడి సినీ జీవితం రివర్స్ అయింది.