Beauty TipsUncategorized

White Teeth:ఒక్క నిమిషంలో పసుపు రంగులోకి మారిన దంతాలు తెల్లగా మారాలంటే…

White Teeth Home Remedies:ఎంత అందంగా ఉండీ, చక్కటి పలువరస ఉండీ, హాయిగా నవ్వగలిగి ఉండీ ఏం లాభం? దంతాలు ప‌చ్చ‌గా, గార ప‌ట్టి ఉంటే ఆ అందం మొత్తం వృధాగా పోతుంది. దంతాలు ప‌చ్చ‌గా, గార ప‌ట్టి ఉంటే ఎవ‌రికీ న‌చ్చ‌దు. తెల్ల‌గా ఉండాల‌నే ఎవ‌రైనా కోరుకుంటారు. అలాకాకుంటే, న‌లుగురిలోకి వెళ్లిన‌ప్పుడు నవ్వులపాలైపోతారు.

తెల్లగా మిలమిలామెరిసే దంతాలకోసం ఇప్ప‌టికే చాలా మంది అనేక రకాల టూత్‌ పేస్టులు, టూత్‌ పౌడ‌ర్లు, టూత్‌ బ్ర‌ష్‌లు మార్చి ఉంటారు. అవన్నీ స‌రైన ఫ‌లితాన్ని ఇవ్వకపోగా మరింత నిరాశకు గురిచేస్తున్నాయి.లెక్కలు అడగొద్దు కాని, ప్రతి ముగురిలో ఒకరినైనా పసుపు రంగు దంతాల సమస్య ఇబ్బంది పెడుతుంది.

తెల్లగా ఉండాల్సిన దంతాలు ఇలా పచ్చగా ఎందుకు మారతాయి అంటే కారణాలు అనేకం. ఉంటాయి. సమస్య తీవ్రం అయ్యేవరకు శ్రద్ద పెట్టకపోవడం మరియు ఆహారపు అలవాట్ల కారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. నేటికాలంలో టీ, కాఫీ, గుట్కా, పాన్లు నమలడం ఎక్కువైపోయింది. దాంతో దంతాలు పచ్చగా గారపట్టడం తద్వారా దంతాలు, చిగుళ్లు అనారోగ్యానికి గురవ్వడం జరిగుతోంది.కారణాలు ఏమైనా దంతాలు పసుపుగా మారినప్పుడు కంగారు పడవలసిన అవసరం లేదు.

ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే పసుపుగా మారిన దంతాలు తెల్లగా మెరిసిపోతాయి. ఒక బౌల్ లో అరస్పూన్ బేకింగ్ పొడి, కొంచెం టూట్ పేస్ట్, రెండు స్పూన్ల కూల్ డ్రింక్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో టూట్ బ్రష్ ని ముంచి దంతాలపై రుద్దాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే క్రమంగా దంతాల మీద పసుపు రంగు పోయి తెల్లగా మిలమిల మెరుస్తాయి. 

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.