కార్తీక దీపం సీరియల్ లో నటించే మోనిత బ్యాక్ గ్రౌండ్ తెలుసా ?

టెలివిజన్ సీరియల్స్ లో నటించే వాళ్లకి మంచి మంచి క్రేజ్ వస్తోంది. కన్నడంలో అగ్ని సాక్షి సీరియల్ నటించిన మోనిత ఆతర్వాత అప్పు గారు ఇచ్చిన ఛాన్స్ తో అంజనీపుత్రలో నటించింది. దీంతో అగ్ని సాక్షి నుంచి తప్పుకుంది. అంజనీ పుత్ర సినిమాను ఏ హరీష్ డైరెక్ట్ చేయగా, ఎం ఎన్ కుమార్ నిర్మించారు. 15కోట్ల బడ్జెట్ తో తీసిన ఈసినిమాకు కథను హరి అందించారు. పునీత్ రాజ్ కుమార్, రష్మిక మందన,రమ్యకృష్ణ,ముఖేష్ తివారి, సాధు కోకిల,రవిశంకర్,హరిప్రియ,అఖిలేంద్ర మిశ్రా, తదితరులు అంజనీ పుత్ర సినిమాలో నటించారు. 

ఈ సినిమా 2017లో డిసెంబర్ 21న విడుదలైంది. ఈమూవీ 75రోజుల్లో 50కోట్లు కలెక్ట్ చేసింది. ఈటీవీలో ప్రసారమయ్యే లాహిరి లాహిరి సీరియల్ లో లహరి గా నటిస్తోంది. ఇందులో గౌరవ్ ,నళిని కూడా నటిస్తున్నారు. 2018దసరానాడు మోనిత ఒక కారుని కొనుక్కుంది. అదే ఏడాది సెప్టెంబర్ లో పరివార్ అవార్డ్స్ లో గుడ్ యాక్టర్ గా అవార్డు అందుకుంది. శ్రావ్యను షూటింగ్ లొకేషన్ లో మత్య అని మోనిత పిలుస్తూ ఉంటుంది. ఉదయ్ టివిలో వచ్చే కావేరి సీరియల్ లో కూడా కొన్ని రోజులు నటించింది.

ఇక తెలుగులో కార్తీక దీపం సీరియల్ లో నటిస్తోంది. దీపను  హ్యాపీగా చూపిస్తే ఇంకా పదేళ్లు అయినా,కార్తీక దీపం సీరియల్ దీపను  చూడ్డానికి ప్రేక్షకులు  సిద్ధంగా ఉన్నారని అంటారు. 2019మే 14న దుర్గ,ఝాన్సీ ,కార్తీక్ లతో కల్సి స్టార్ మా పరివార్ లీగ్ లో పాల్గొంది. ఈమె హెయిర్ స్టయిలిస్ట్ పేరు విక్కీ. సౌందర్య ,బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ,అమృత,చైత్ర,మాటే మంత్రం సీరియల్ కవిత,వీళ్లందరికీ కూడా విక్కీయే హెయిర్ స్టయిలిస్ట్. ఇతడి అసలు పేరు వెంకటేష్. మోనిత వేసుకునే డ్రెస్ లను హైదరాబాద్ కృష్ణ నగర్ మను స్టూడియో నిర్వాహకులు, ప్రముఖ డిజైనర్ మానసా నాయడు డిజైన్ చేస్తున్నారు.