Movies

జూనియర్ ఎన్టీఆర్ తో జరిగిన వివాదం ఎప్పటికీ మర్చిపోలేను అంటున్న రాజీవ్ కనకాల

నటుడు దర్శకుడు దేవదాస్ కనకాల కుమారుడు రాజీవ్  కనకాల గతంలో ఎక్కువగా సినిమాల్లో చేసినా తర్వాత తగ్గించాడు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం మహర్షిలో నటించాడు. టాప్ యాంకర్ సుమను లవ్ మేరేజ్ చేసుకున్న రాజీవ్ కనకాల ఆమెను పూర్తిస్థాయిలో ఎంకరేజ్ చేసాడు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ప్రాణ స్నేహితుడు కూడా. జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ లో రాజీవ్ నటిస్తుంటాడు. అయితే తారక్ గురించి తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 

అశోక్ సినిమాతో ఇద్దరి మధ్యా కొంత గ్యాప్ ఏర్పడిందట. ఈమేరకు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిపై రాజీవ్ క్లారిటీ ఇస్తూ, ‘నేను ఇండస్ట్రీలో ఎవరినీ దూరం చేసుకోలేను. కానీ నన్ను దూరం పెట్టాలని చూస్తే అది వారి ఇష్టం”అన్నాడు. ఇక తారక్ తో విబేధాలున్నట్లు వచ్చిన వార్తలు కేవలం కొందరు సృష్టించిన పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశాడు. తారక్ తో విబేధాలుంటే, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ మూవీస్ లో ఎలా చేస్తానని ప్రశ్నించాడు. 

‘స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా సమయంలోనే నన్ను ఎప్పటికీ మర్చిపోవద్దని చెప్పాను. మర్చిపోనని చెప్పాడు. ఆనాటి నుంచి ఇంకా మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నాం’ అని రాజీవ్ కనకాల చెప్పాడు. తారక్ నటించే ప్రతి చిత్రంలో నటించాలంటే కుదరదని,దర్శకుల చాయిస్ ని బట్టి ఉంటుందని రాజీవ్ కనకాల చెప్పాడు. నిజానికి తారక్ నా కన్నా చిన్నవాడు ,మా ఫ్రెండ్ షిప్ ఎప్పటికీ చెక్కు చెదరదని అంటున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."