Movies

సైరాలో అనుష్క పాత్ర డిసైడ్ అయిందా?

ఖైదీ నెంబర్ 150మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న భారీ చిత్రం సైరా. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రామ్ చరణ్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. సురేంద్ర రెడ్డి డైరెక్షన్ లో తీస్తున్న ఈ మూవీ చివరి దశకు చేరింది. ఇంతలో అగ్ని ప్రమాదం సంభవించి సెట్ కాలకుండా ఉంటే  ఇంకా వేగంగా షూటింగ్ పూర్తయ్యేదని టాక్. 

షూటింగ్ కి గ్యాప్ రావడంతో దసరాకు రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సమయానికి తెరమీద పడుతుందా అనే అనుమానం కలుగుతోంది. ఇక హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా, స్వీటీ అనుష్క కీలక పాత్రలో నటిస్తోందట. అయితే దీనిపై క్లారిటీ పూర్తిగా రాకపోయినా తాజాగా వస్తున్న వార్తలను బట్టి, సైరా నరసింహారెడ్డి పాత్రను పరిచయం చేసే క్యూరేటర్ గా కనిపిస్తుందట. రామ్ చరణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అనుష్కను ఒప్పించినట్లు టాక్ వినిపిస్తోంది. 

సినిమా కథలో భాగంగా కాకుండా చిత్ర కథను మనకు వివరించే, యాంకర్ రోల్ గా అనుష్క కనిపిస్తుందన్నమాట. దీన్నిబట్టి చిరు పక్కన అనుష్క కనిపించే ఛాన్స్ లేదని చెప్పవచ్చు. మహానటిలో సమంత , కీర్తి సురేష్ ల కాంబినేషన్ ఎలా ఉండదో ఈ సినిమాలో కూడా అంతేనని భావిస్తున్నారు. ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా నిజం ఇదేనని అంటున్నారు.