Movies

హీరోగా మారిన వినాయక్ కి జోడిగా నటించే స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో ఎవరెప్పుడు ఎలా మారతారో ఎవరికీ తెలీదు. హీరోలు విలన్ క్యారెక్టర్స్   కి మారాల్సి వస్తోంది. విలన్స్ హీరో లుగా రాణిస్తున్నారు. ఇక డైరెక్టర్ లు కూడా నటులుగా అవతారం ఎత్తుతున్నారు. తాజాగా తెలుగులో మాస్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచుకున్న వి.వి.వినాయక్ ఇప్పుడు హీరోగా మారుతున్నాడు. ఒక మాస్ దర్శకుడిగా తన సత్తా ఏంటో తన సినిమాల ద్వారా చాటిన వినాయక్ హీరోగా ఒక చిత్రం తెరకెక్కనుంది. అది కూడా దిల్ రాజు నిర్మిస్తున్నాడు

అయితే ఒక మధ్య వయసుకు చెందినటువంటి ఒక వ్యక్తికీ సంబందించిన ఒక కథ దిల్ రాజు వద్దకు రాగ, దాంట్లో కథానాయకుడి పాత్ర పోషించడానికి వినాయక్ ఐతే సరిగ్గా సరిపోతాడని, సంప్రదింపులు జరపగా అందుకు తానూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమా పట్టాలెక్కుతోంది. నిజానికి కొంత కాలం నుండి సరైన విజయాలు లేక సతమవుతున్నటువంటి వినాయక్ కి హీరో గా ఈ సినిమా అయినా విజయం ఇస్తుందా అనేది సినీ వర్గాల్లో టాక్ జోరుగా నడుస్తోంది.

ఇక ఈ చిత్రానికి వినాయక్ బాడీ లాంగ్వేజ్ అయితే సరిగ్గా సరిపోతుందని అందుకోసమనే దిల్ రాజు పట్టు బట్టి మరీ వినాయక్ ని ఒప్పించాడని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న మాట. కాగా ఈ చిత్రంలో వినాయక్ కి జోడిగా నటించేందుకు ఒక స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తానెవరో కాదు వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఠాగూర్ మూవీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రేయ కావడం విశేషం. ఈ చిత్రంలో నటించేందుకు శ్రేయ కూడా ఒప్పుకుందని, త్వరలోనే ఈ చిత్రం మొదలవబోతుందని వార్తలు వస్తున్నాయి.