Healthhealth tips in telugu

వేసవిలో ఉల్లిపాయ తింటున్నారా… ఈ 3 నిజాలను తెలుసుకోకపోతే నష్టపోతారు

Onion Health Benefits : ఆలియేసి కుటుంబంలో ఆలియమ్ ప్రజాతికి చెందిన ఉల్లిపాయను సాధారణంగా ప్రతి రోజు వంటలలో వేస్తూ ఉంటాం. ఉల్లిపాయ శాస్త్రీయ నామం ఆలియమ్ సీపా. భారతీయులు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచే వాడుతున్నారు.ఉల్లిపాయను వంటల్లో ఎదో రుచి కోసం వేస్తాం అని అనుకుంటాము కానీ దీనివల్ల మనకు జరిగే మంచి మాత్రం వందలో పదిమందికి కూడా తెలియదు.
How to cut onions without crying In Telugu
ఉల్లిపాయను కోసేటప్పుడు ఎన్ని కన్నీళ్లు తెప్పిస్తుందో మనకు అంతకుమించి మేలును  చేస్తుంది. ఉల్లి చేసే మేలు తల్లి చేయదని అంటారు. ప్రతి రోజు ఒక పచ్చి ఉల్లిపాయ తింటే డాక్టర్ అవసరం ఉండదని ఈ మధ్య కాలంలో జరిగిన పరిశోధనలలో తేలింది. ఉల్లిపాయలో క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం మరియు పాస్పరస్ వంటి మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి.
Eating raw onion with meals health benefits telugu
ఉల్లిపాయలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధులకు ఉపశమనం కలిగిస్తాయి. నోటి నంచి దుర్వాసన వస్తుందని చాలా మంది ఉల్లిపాయను తినడానికి ఇష్టపడరు. అటువంటి వారు ఇప్పుడు చెప్పే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే ఉల్లిపాయను తినటం అలవాటు చేసుకుంటారు.
White teeth tips
దంత క్షయాన్ని మరియు దంతాలలో ఇన్ ఫెక్షన్స్ ని తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయ ముక్కలను నోటిలో వేసుకొని  రెండు నిముషాలు నమిలితే నోటి మూలల్లో  ఉన్న సూక్ష్మక్రిములను నశింపచేసి దంత క్షయాన్ని తొలగిస్తుంది. పంటి నొప్పితో బాధపడేవారు చిన్న ఉల్లిపాయ ముక్కను నమిలితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
Onion benefits in telugu
ఉల్లిపాయ రక్తం గడ్డకట్టకుండా పలుచగా ఉండేలా చేసి రక్తం కణాలన్నింటికీ ప్రసరించేలా చేస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే గుండెకు సంబందించిన సమస్యలు వస్తాయి. గుండె జబ్బులతోనూ, బీపీతోనూ బాధపడే వాళ్లు రోజూ 100 గ్రాముల ఉల్లిని తీసుకోవటం చాలా మంచిది. మొటిమల సమస్యతో బాధపడుతున్నప్పుడు ఉల్లిపాయ బాగా సహాయపడుతుంది.
Onion beaUTY tIPS
ఉల్లిపాయ పేస్ట్ ని మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మొటిమలు మరియు మొటిమల కారణంగా వచ్చే నల్లని మచ్చలు కూడా తొలగిపోతాయి. గొంతు నొప్పి,దగ్గుతో బాధ పడుతున్నప్పుడు ఒక స్పూన్ ఉల్లిరసంతో ఒక స్పూన్ తేనే కలిపి త్రాగితే దగ్గు నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది.

ఉల్లిపాయ మంచి  కీటక నాశిని అని చెప్పవచ్చు. పురుగులు,కీటకాలు కుట్టినప్పుడు ఆ ప్రదేశంలో ఉల్లిపాయ పేస్ట్ ని రాస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఉల్లిపాయలో   క్యాన్సర్ కణాల అభివృద్ధిని అడ్డగించే చురుకైన సమ్మేళనాలు సమృద్ధిగా ఉన్నాయి.