Movies

విజయ్ దేవరకొండ లవ్ బ్రేక్ అప్….!!!

పెళ్లిచూపులు మూవీతో ఎంట్రీ ఇచ్చి,గీత గోవిందం వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్స్ అనే మూవీ చేస్తున్నాడు. అయితే ఇతగాడు ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ కి లవ్ బ్రేక్ అప్ చెప్పాడట. అయితే రియల్ లైఫ్ లో కాకుండా రీల్ లైఫ్ లోనే. అవును ఒక్క హీరోయిన్ తోనే సందడి చేసే విజయ్ సరసన ఇప్పుడు ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. కె ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాకు క్రాంతి మాధవ్ డైరెక్షన్ చేస్తున్నాడు. 

రాశిఖన్నా ,ఐశ్వర్య రాజేష్,ఫారిన్ మోడల్ ఇజబలి లీట్ అనే ముగ్గురు ముద్దుగుమ్మలు ఈ సినిమాలో నటించబోతున్నారట. ముగ్గరు హీరోయిన్స్ తో విజయ్ అదరగొట్టడం ఖాయమని అంటున్నారు. ఈ సినిమాకు బ్రేక్ అప్ అనే టైటిల్ పెడుతున్నారట. ఈ సినిమాలో విజయ్ లవ్ లో పడడం పరిస్థితుల కారణంగా బ్రేక్ అప్ చెప్పడం చేస్తాడట. అలా ఇద్దరికీ బ్రేకప్ చెప్పాక మూడవ వ్యక్తితో లవ్ సక్సెస్ అవుతుందట. 

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా విజయ్ పంధాలోనే ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. ఇక ఈ సినిమాతో పాటు తమిళ డైరెక్టర్ ఆనంద్ అన్నామలై డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే విజయ్ సినిమా ఈ మధ్యనే మొదలైందట. హీరోయిన్ మాళవిక ఇందులో హీరోయిన్ గా చేస్తోందట. ఇలా వరుస సినిమాలతో విజయ్ దేవరకొండ వరుస బిజీలతో ఉంటున్నాడు