Movies

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో..ఆదికు పోటీగా ఆలీ పంచులు.!

ఏపీ లోని ఎన్నికల వలన స్మాల్ స్క్రీన్ సెన్సషనల్ షో జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రాములలో నాగబాబు మరియు రోజాలను తెలుగు ప్రేక్షకులు కాస్త మిస్సయ్యారు.ఆ తర్వాత కొన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ రోజా రీఎంటర్ అయినా నాగబాబు మాత్రం ఇంకా రాలేదు.దీనితో నాగబాబు స్థానంలో శేఖర్ మాస్టర్ మరియు జానీ మాస్టర్ లు కనిపించారు.కానీ ఈసారి నుంచి మాత్రం నాగబాబు స్థానంలోకి ప్రముఖ సినీ కమెడియన్ ఆలీ కనిపించబోతున్నట్టు ఇటీవలే విడుదలైన జబర్దస్త్ ప్రోమోను చూస్తే అర్ధం అవుతుంది.

ఇక ప్రోమో విషయానికి వచ్చినట్టయితే ఎప్పటిలానే నాన్ స్టాప్ ఎంటెర్టైన్మెంట్ పక్కా అని చెప్పాలి.ఆది తనదైన పంచులు కురిపించగా అక్కడక్కడా ఆలీ కూడా తనదైన శైలి పంచులు వేసి నవ్వించారు.అలాగే ఈసారి రాకేష్ చిన్న పిల్లల బ్యాచ్ లోకి మరికొంత మంది పిడుగులు యాడ్ అయ్యారు.వీరి వల్ల మరింత కామెడీ జెనరేట్ అయ్యింది.అలాగే మరో స్టైల్ బిల్డప్ బాబాయ్ గా అదిరే అభి కూడా మంచి కామెడీతో ఆకట్టుకున్నట్టు ఈ ప్రోమోను చూస్తే అర్ధమవుతుంది.మరి ఈ పూర్తి షో ఇంకెంత వినోదభరితంగా ఉండబోతుందో తెలియాలంటే వచ్చే 30 గురువారం రాత్రి 9:30 గంటలకు ఈటీవీ ఛానెల్లో జబర్దస్త్ ప్రోగ్రాం ను చూడాల్సిందే.