ప్రశాంత కిషోర్-జగన్ అనుబంధం-రియల్ స్టోరీ

రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే పేరు ప్రశాంత్ కిషోర్ అదేనండి పీకే. ప్రస్తుత ఎన్నికల్లో వైస్సార్ సిపి ఘనవిజయం సాధించడానికి,జగన్ సీఎం అవ్వడానికి కీలకంగా పనిచేసిన వ్యక్తి పీకే. బీహార్ కి చెందిన పీకే 8ఏళ్ళు ఐరాసలో పనిచేసారు. 2001లో నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం గా ఉండగా,ఆయన వ్యూహ కర్తల బృధంలో ఒకరిగా చేరిన పీకే 2012లో మోడీ గెలుపునకు బాటలు వేశారు. ఇక మోడీని ప్రధానికి చేయడానికి సిటిజన్స్ ఫర్ ఎక్కౌంట్ బుల్ గవర్నెస్ అనే ప్రబ్లిసిటీ మీడియా సంస్థను 2013లో ప్రారంభించారు. మోడీపై వినూత్న ప్రయోగాలలో భాగంగా చాయ్ పై చర్చ బాగా కనెక్ట్ అయింది. మొత్తానికి మోడీ ప్రధాని అయ్యారు. అయితే మోడీతో వచ్చిన విభేదాలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ పక్కకు చేరిన పీకే 2015లో నితీష్ ని మళ్ళీ సీఎం చేయడంలో కీలక వ్యూహం పనిచేసింది.

ఇక యుపి,బీహార్ లలో కాంగ్రెస్ విజయం కోసం కూడా పీకే సలహాలు అందించారు. పంజాబ్ లో పీకే వ్యూహం బాగా పనిచేసినప్పటికీ యుపిలో బెడిసి కొట్టింది. ఇక 2017 జులై 6న వైసిపి వ్యూహ కర్తగా పీకేను పార్టీ ముఖ్య నాయకులకు జగన్ పరిచయం చేసారు. ఆతరువాత వైసిపి ప్లినరీలో కార్యకర్తల సమక్షంలో పికెని ప్రత్యేక సలహాదారుగా ప్రకటించారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక మొదలు,క్షేత్ర స్థాయిలో ప్రచారం వరకూ అన్ని దశల్లో పీకే కీలకంగా వ్యవహరించారు. డాక్టర్ వైఎస్ పై గల అభిమానం ఒక్కటే సరిపోదని,టీడీపీని దెబ్బతీయడానికి షోషల్ మీడియాను,టెక్నాలజీని బాగా వినియోగించుకున్నారు. చంద్రబాబు,లోకేష్ లను టార్గెట్ చేసుకుని సెటైర్లతో సాగించిన ప్రచారం బాగా జనాలకు కనెక్ట్ అయింది.
వైసిపి సోషల్ మీడియాతో పాటు ఇతర సోషల్ మీడియాలను కూడా తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో సాగిన ప్రచారం టిడిపిపై వ్యతిరేకత నెలకొల్పడానికి దారితీసేలా చేసింది.

కేవలం 5లక్షల ఓట్లతో చంద్రబాబు గత ఎన్నికల్లో గెలిచాడన్న ప్రచారం జోరుగా సాగించి,చంద్రబాబు ఓటు బ్యాంకు ని దెబ్బ కొట్టడమే లక్ష్యంగా గ్రామ స్థాయి నేతలను వైసిపి వైపు ఆకర్షించేలా చేసారు. తెలంగాణకు చెందిన కుల సంఘాల నేతలను రంగంలోకి దించి బిసిల్లో చీలిక తేవడం కోసం చంద్రబాబుకి వ్యతిరేకంగా సమావేశాలు పెట్టించారు. వచ్చేది వైసిపి ప్రభుత్వమని ఊదరగొట్టడం ద్వారా టీడీపీ శ్రేణుల్లో అయోమయం సృష్టించారు. జగన్ కి ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు ప్రచారం పుట్టించి దాన్ని పోలింగ్ వరకూ తీసుకెళ్లగలిగారు. ప్రజల్లో మార్పు కలిగించేలా చేయగలిగారు.