DevotionalUncategorized

ఇంటిలో శివలింగం ఉండవచ్చా…ఏ నియమాలు పాటిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి

మన దేశంలో ప్రతి ఊరులోనూ చిన్న చిన్న గ్రామాల్లోను కూడా శివాలయం ఉంటుంది. శివాలయం లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదేమో. మనలో చాలా మంది ప్రతి సోమవారం శివాలయానికి వెళుతూ ఉంటారు. అయితే కొంత మంది మాత్రమే దేవుని మందిరంలో శివ లింగాన్ని పెట్టి పూజిస్తూ ఉంటారు. కొంత మంది ఇంటిలో శివ లింగం ఉండకూడదని అంటూ ఉంటారు. ఇంటిలో శివ లింగానికి పూజ చేయవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ రోజు ఆ సందేహం గురించి తెలుసుకుందాం. మన దేశంలో చరిత్రకి అందని కాలంనుంచీ శివ పూజ కనిపిస్తుందని చరిత్రకారులు అంటున్నారు. అమర్‌నాథ్, కేదార్‌నాథ్ మొదలు రామేశ్వరం దాకా యావత్ భారతదేశం శివ క్షేత్రాలే ఉన్నాయి. ఇంటిలో శివుని పటానికి పూజ చేయవచ్చు.

కానీ లింగరూపంలో శివార్చన చేయకూడదని అంటూ ఉంటారు. శివపురాణం, దేవీ భాగవతం, స్కందపురాణం వంటి పురాణాలను చూసినప్పుడు ఇంటిలో లింగం ఉండటం తప్పు కాదని అనిపిస్తుంది. శివ లింగాన్ని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. ఇంటిలో శివ లింగం ఉంటే ఐశ్వర్యం కలగటమే కాకుండా ప్రశాంతమైన వాతావరణం నెకొని మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఇంటిలో శివ లింగాన్ని పెట్టుకునే ముందు కొన్నిసూచనలు, నియమాలు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. పండితులు చెపుతున్న ప్రకారం శివ లింగం  బొటన వ్రేలంత మాత్రమే వుండాలి. లేదంటే, మనం పిడికిలి బిగించినప్పుడు… అందులో ఇమిడిపోయి బయటకు కనిపించినంత సైజులో మాత్రమే వుండాలి. అంతకన్నా పెద్ద శివ లింగాన్ని ఇంటిలో పెట్టకూడదు.

శివునికి కుంకుమతో పూజ చేయకూడదు. బిల్వ దళాలు,విభూతి,పాలు,తేనే,నీరు వంటి వాటితో పూజ చేయాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శివ లింగం ఇంటిలో ఉంటె ప్రతి రోజు తప్పనిసరిగా అభిషేకం, నైవేద్యం చేయవలసిందే. ఎటువంటి అంటకాలు వచ్చిన ఇంటిలోని వారు ఎవరో ఒకరు తప్పనిసరిగా చేయవలసిందే. ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు    ఎవరికీ పూజ చేయటం కుదరని పక్షంలో శివ లింగాన్ని బియ్యం బస్తాలో పెట్టాలి. ఈ విధంగా చేయటం వలన పూజ చేయని దోషంరాదు . ఈ నియమాలను తప్పనిసరిగా పాటిస్తే మాత్రం శివ లింగాన్ని ఇంటిలో పూజించవచ్చు. ఈ నియమాలను పాటించలేని వారు మాత్రం శివ లింగాన్ని ఇంటిలో పూజించకూడదు.