Movies

సిద్ధార్ధ్ కు తల్లిగా నటించిన ప్రవిత.. సిద్ధార్ధ్ కంటే ఎంత చిన్నదో తెలుసా?

టాలీవుడ్ లో అందం, అభినయంతో తల్లి పాత్రలను పోషిస్తున్న ప్రవిత లోకేష్ మైసూర్ లో స్థిరపడ్డ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చింది. పవిత్ర తండ్రి లోకేష్ స్టేజ్ ఆర్టిస్ట్. అయన కన్నడలో 200 వరకు సినిమాలు చేసారు. అయన సడన్ గా చనిపోవటంతో పరిస్థితులు మారిపోయాయి. పవిత్ర కూడా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. పవిత్ర భర్త సూచేంద్ర ప్రసాద్ మంచి నటుడు మరియు నిర్మాత. అలాగే పవిత్ర లోకేష్ తమ్ముడు ఆది లోకేష్ కూడా కన్నడలో సినిమాలు చేస్తున్నాడు.

అంతేకాక కన్నడ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసాడు. పవిత్ర లోకేష్ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకు సాగుతుంది. నాకు ఇలాంటి పాత్రలే కావాలని ఏ నాడు వెయిట్ చేయలేదు. ఆమె ఒక ఆసక్తికరమైన విషయాన్నీ చెప్పారు. 

ఆ విషయం వింటే మనకు చాల ఆశ్చర్యం కలుగుతుంది. అది ఏమిటంటే సిద్దార్ద్ నటించిన ‘బావ’ సినిమా గుర్తు ఉందా? ఆ సినిమాలో సిద్దార్ద్ కి తల్లిగా పవిత్ర లోకేష్ నటించారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే సిద్దార్ద్ పవిత్ర లోకేష్ కన్నా నాలుగు సంవత్సరాలు పెద్ద అని పవిత్ర లోకేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 

టాలీవుడ్ లో యంగ్ హీరోస్ చాలామంది ఆవిడ కంటే పెద్ద వాళ్లే మరి. టాలీవుడ్ లో చాలామంది యంగ్ హీరోస్ మీరు నా పక్కన హీరోయిన్ గా చేయాల్సింది పోయి తల్లిగా అయిపోయారని ఆట పట్టిస్తుంటారట. ఇంత చేస్తే ఆవిడా వయస్సు 39 సంవత్సరాలు.

ఇలా తల్లి పాత్రలు, క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ గా చేస్తుంటే నాకేం బాధలేదు. ఎందుకంటే నాకున్న పరిధికి ఇదే చేయగలను. ఎప్పుడు ఆర్టిస్ట్ గా నిరూపించుకోగలుగుతున్నాను. చేసే పనిలో సంతృప్తి అనేది ఉండాలని అంటారు పవిత్ర లోకేష్.