రజినీకాంత్ కోసం రామ్ చరణ్ ప్రయత్నాలు – ఎందుకంటే…?

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, రామ్ చరణ్ నిర్మాతగా, ఒక స్వాతంత్య్ర సమరయోధుడి కథతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి.. కాగా చిరంజీవి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ చిత్రానికి సంబందించిన చిన్న చిన్న పనులన్నీ కూడా భారీ గానే ఉండేలా చూసుకుంటున్నారు చిత్ర యూనిట్. కాగా ఇటీవలే ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. కాగా ప్రస్తుతానికి ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషన్స్ తదితర కార్యక్రమాలపై ద్రుష్టి సారించారు. కాగా ఈ చిత్రం మహాత్మా గాంధీ గారి జన్మదినం సందర్భంగా అక్టోబర్ 2 న విడుదల చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించారు. అయితే అంతకు ముందే ఈ చిత్ర ట్రైలర్ ని భారీగా విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు.


అయితే ఈ చిత్ర ట్రైలర్ ని కాస్త వినూత్నంగా రిలీజ్ చేయటానికి నిర్మాత రామ్ చరణ్ సరికొత్త నిర్ణయాలు తిసుకున్నట్లు సమాచారం. అయితే ఈ ట్రైలర్ ని హిందీలో బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ ద్వారా విడుదల చేయాలనీ నిర్ణయించుకోగా, ఇక తమిళ ట్రైలర్ విషయానికొస్తే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ద్వారా విడుదల చేయించాలని అనుకుంటున్నారు. అందుకుగాను రజినీకాంత్ ని ఒప్పించే పనిలో పడ్డారు రామ్ చరణ్. అయితే వారి మధ్యన ఉన్నటువంటి చనువు ద్వారా రామ్ చరణ్, రజినీకాంత్ ని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ రజినీకాంత్ ఒప్పుకుంటారా లేదో చూడాలి మరి…