మెగాస్టార్ `సైరా ` ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చే గెస్ట్ ఏవరో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేష‌న్ సైరా న‌ర‌సింహారెడ్డి. ఈ చిత్రానికి స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పైన రామ్ చ‌ర‌ణ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఈ సంచ‌ల‌న చిత్రం అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.అది ఏంటంటే…. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత భారీగా చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ బృందం ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక స్థానాన్ని ఖరారు చేసింది కానీ.. వారు తిరుపతి, విజయవాడ మరియు కర్నూలు వంటి ప్రదేశాలలో ఇతర వేదికలను కూడా చూస్తున్నారు.వేదిక మరియు తేదీ ఖరారైన తర్వాత, ఈవెంట్ అధికారికంగా ప్రకటించనున్నార‌ని స‌మాచారం. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే… ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సూప‌ర్ స్టార్ రజనీకాంత్‌ను పిల‌వ‌నున్నార‌ని తెలిసింది.