Health

పులుపు ఎక్కువగా వాడితే ఇన్ని లాభాలా..? తప్పక తెలుసుకోండి

పులుపును మన శరీరంలో అంతర్భాగం చేసుకోవాలి. ఈ పులుపు లభించే పదార్థాలు… చింతపండు, ఉసిరి, నిమ్మ, ముగ్గని నారింజ, మామిడి వంటి పళ్ళు, వెనిగర్ వంటివి ఇలాంటివాటి కోవలోకి వస్తాయి. పులుపుతో శరీరంపై ప్రభావం ఏమిటో తెలుసుకుందాం…

అధికంగా తీసుకుంటే ఏం జరుగుతుంది? కఫ, వాత, పిత్త దోషాలు కలుగుతాయి.దృష్టి మందగిస్తుంది. శరీరం అనారోగ్యం పాలవుతుంది.ఆహారాన్ని అధికంగా జీర్ణ పరుస్తుంది.కాళ్ళు, చేతులు నీరు పడతాయి. దాహం ఎక్కువ అవుతుంది. ఎనీమియా, చర్మ వ్యాధులు, తలతిరగడం, దురదలు కలుగుతాయి.పులుపు ప్రభావం ఏమిటి? నోటిలో లాలాజలం ఎక్కువుగా ఊరేట్లు చేస్తుంది. జీర్ణ క్రియకు సహాయపడుతుంది. మల విసర్జన బాగా జరగుతుంది. నిల్వ ఉన్న జిగురు పదార్థాలను బైటికి పంపుతుంది. పదార్థాలకు మంచి రుచినిస్తుంది. జఠరాగ్నిని పెంచుతుంది. బలంగా ఉంటారు.