అమితాబ్ కి తీవ్ర అస్వస్థత – ఆసుపత్రిలో చికిత్స

ఇటీవలే భారత చిత్ర రంగానికి సంబందించిన సేవలకు గాను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వారించినా సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ విషయాన్నీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా ఈ విషయం తెలుసుకున్న అభిమానులందరూ కూడా ఎంతగానో సంబరపడిపోయారు. కాగా ఇంతటి ఆనందంలో ఉన్నటువంటి అభిమానులకు ఇపుడు ఒక చేదు వార్త తగిలిందని చెప్పాలి. కాగా గురువారం నాడు అమితాబ్ తీవ్రంగా అస్వస్థతకు గురవడంతో తక్షణమే స్పందించిన కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.

కాగా లివర్ సంబంధిత సమస్య కారణంగా ఇటీవల అమితాబ్ చాలా తీవ్రంగా అస్వస్థతకు గురవుతున్నారు. కాగా ఈ నెల 15 వ తేదీన రాత్రి రెండు గంటల సమయంలో, తీవ్ర అనారోగ్య సమస్య కారణంగా అమితాబ్ ని ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. అయితే ఇటీవల కూడా ఇలా అస్వస్థతకు గురైన మెగాస్టార్, మళ్ళీ త్వరగానే కోలుకొని ఎదావిదిగా సినిమాల్లో నటించారు. కాగా ఇటీవలే ఒక టీవీ షో కౌన్ బనేగా కరోడ్ పతి షూటింగ్ లో పాల్గొంటున్నట్లు సమాచారం.

error: Content is protected !!