రాహుల్ కంటే శ్రీముఖి క్రేజ్ ఎంత ఎక్కువగా ఉందో చూడండి

తెలుగులో ఈసారి జరిగిన బిగ్ బాస్ ఫైనల్స్ వార్ లో శ్రీముఖికి దక్కుతుందనుకున్న బిగ్ బాస్ 3 టైటిల్ రాహుల్ ఎగరేసుకుపోయాడు.మొదట నుంచి కూడా శ్రీముఖియే బిగ్ బాస్ విన్నర్ అని అనుకున్నారు అంతా కానీ ఊహించని విధంగా రాహుల్ కు దశ తిరిగి టైటిల్ సొంతం అయ్యింది.అయితే మొదట నుంచి కూడా శ్రీముఖికి చాలా గట్టి సోషల్ మీడియా విభాగం కానీ అలాగే ఆమెకు ఆఫ్ లైన్ లో సపోర్ట్ చేసే వారు కానీ అధికమే కానీ టైటిల్ మాత్రం ఆమెకు దక్కలేదు.

అయినా కూడా ఆమెనే అసలైన విన్నర్ గా ఆమె అభిమానులు మరియు కుటుంబ సభ్యులు ఆఖరుకు శ్రీముఖియే చెప్పుకున్నప్పుడు చాలా మందికి అది కాస్త ఓవర్ గా అనిపించి ఉండొచ్చు.అలాగే శ్రీముఖి కంటే కూడా అధికంగా రాహుల్ కే ఓట్ చేసి ఉండొచ్చు.కానీ రాహుల్ కంటే శ్రీముఖికే ఉన్న క్రేజ్ ఎక్కువని ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూతో నిరూపితం అయ్యింది.స్టార్ మా మ్యూజిక్ ఛానెల్ వారు బిగ్ బాస్ 3 కీలక కంటెస్టెంట్స్ తో తనీష్ ఇంటర్వ్యూలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

అలాగే మొదటగా విన్నర్ రాహుల్ తో ఇంటర్వ్యూ తీసుకున్నాడు.మళ్ళీ ఈ మధ్యనే శ్రీముఖి ఇంటర్వ్యూ తీసుకున్నాడు.కానీ విన్నర్ గా నిలిచిన రాహుల్ కంటే నెటిజన్స్ మాత్రం శ్రీముఖి ఇంటర్వ్యూనే చూసేందుకు ఎక్కువ ఇష్టపడ్డారు.6 రోజులు కితం రాహుల్ ఇంటర్వ్యూ పెట్టగా దానికి ఇప్పటి వరకు ఇంకా నాలుగు లక్షల వ్యూస్ కూడా రాలేదు.అలాగే ఇప్పుడు పెట్టిన శ్రీముఖి ఇంటర్వ్యూ కు మాత్రం కేవలం ఒక్క రోజులోనే హాఫ్ మిలియన్ వ్యూస్ వచ్చేసాయి.అంటే దీనిని బట్టి రాహుల్ కంటే శ్రీముఖి అంటేనే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారని అర్ధం చేసుకోవచ్చు.దీనిని బట్టి రాహుల్ కంటే శ్రీముఖి క్రేజ్ నిజంగానే వేరే లెవల్లో ఉందని చెప్పడంలో ఏ;అని చెప్పొచ్చు.