సౌందర్య భర్త ఇప్పుడు ఎక్కడ ఏమి చేస్తున్నాడో తెలుసా…సౌందర్య ఆస్థిని ఏమి చేసాడో తెలుసా?

నటి సౌందర్య చనిపోయి చాలా ఏళ్ళు గడుస్తున్నా సావిత్రి తర్వాత అంతటి నటిగా ఇప్పటికీ జనంలో సుస్థిర స్థానం ఏర్పరచుకుంది. ఈమె పేరిట సోషల్ మీడియాలో ఎన్నో ఎక్కౌంట్స్ కొనసాగడమే ఈమెకు ఏమాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదని రుజువు చేస్తోంది. సౌందర్య రఘు అనే వ్యక్తిని పెళ్లాడిన సంగతి తెల్సిందే. ఈమె కట్టు బొట్టూ చూసి తెలుగు అమ్మాయి అనుకుంటారు. కానీ ఈమె కన్నడం అమ్మాయి.

తెలుగు,తమిళ,మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో గొప్ప నటనను ప్రదర్శించింది. ఎన్నో కోట్ల ఆస్తిని కూడబెట్టింది. అయితే సౌందర్య చనిపోయాక ఆతడు ఎక్కడ ఎలా వున్నాడో అనే విషయాల్లోకి వెళదాం. సౌందర్య 2003లో రఘుని పెళ్లాడింది. 2004ఏప్రియల్ 17న విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైంది. 2010లో అర్పిత అనే డాక్టర్ ని రఘు పెళ్లిచేసుకున్నాడని టాక్.

సౌందర్య ఆస్తికి రఘు ఓనర్ గా ఉన్నాడు. అంతేకాదు ఓ అమ్మాయితో గోవాలో తిరుగుతూ,సౌందర్య ఆస్తిని దుర్వినియోగం చేస్తున్నాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మొత్తానికి ఓ గొప్ప నటిని పోగొట్టుకున్నాక ఇక ఎవరు ఎలా అయితే ఏమిటి అని గుసగుసలు విన్పిస్తున్నాయి.