కట్టప్ప పారితోషికం ఎంతో తెలుసా?

తెలుగు సినిమాల్లో హీరోహీరోయిన్లకు ఎంతటి ప్రాముఖ్యత ఉన్నదో అటువంటి ప్రాముఖ్యత ఉన్న పాత్రా కూడా ఒకటి ఉంటుంది. సైడ్ క్యారెక్టర్ అయినప్పటికీ ఆ పాత్రకు జనం ఇంప్రెస్ అవుతుంటారు. అటువంటి పాత్రల్లో నటించి, తన పేరును చిరస్థాయిగా నిలబెట్టుకోవాలని చూస్తుంటారు.

కాగా బాహుబలి సినిమాలోని కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్ అంతకుముందే పలు సినిమాల్లో చేసినా, బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ మాత్రం పీక్స్‌కు చేరుకుంది. బాహుబలి సినిమా తర్వాత కట్టప్పగా ఎక్కువ పేరు తెచ్చుకున్న సత్యరాజ్ ప్రస్తుతం వరుసగా తెలుగు, తమిళ సినిమాల్లో తండ్రి, టాటా పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. కాగా అయన ఒక్క సినిమాకు దాదాపు 2.5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు.

తమిళంలో అయితే ఆయనే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటాడు. కానీ తెలుగులో సత్యరాజ్ పాత్రకు మరొకరితో డబ్బింగ్ చెప్పిస్తారు. అందుకు అదనంగా మరో 25 లక్షలు ఖర్చు. మొత్తానికి సత్యరాజ్ తెలుగు, తమిళ సినిమాల్లో తనదైన ముద్ర వేస్తూనే పారితోషికంతో మిగిలిన పాత్రలకంటే స్పీడ్ గా దూసుకెళ్తున్నారు.