పడిపోయిన రజినీ మార్కెట్..ఫస్ట్ డే కష్టమే.!

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కు క్రేజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.మన దేశం నుంచి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న హీరోల్లో తలైవా రజినీ కూడా ఒకరు.రజినీ సినిమా వస్తుంది అంటే ఆల్ ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే.అలాగే తనకు మార్కెట్ ఉన్న ప్రతీ చోటా రజిని మొదటి రోజు భారీ వసూళ్లను రాబట్టడం ఖాయం అని అందరికీ తెలుసు.అలాగే తమిళ్ లో ప్రేక్షకులు రజినీ సినిమాలు అంటే ఎంతలా ఆదరిస్తారో మన తెలుగు ప్రేక్షకులు కూడా అంతే స్థాయిలో ఆదరిస్తారు.

కాకపోతే రజినీ కెరీర్ లోని ఒక సినిమా మూలంగా ఎంత హైప్ అయితే వచ్చిందో అంతే నష్టం కూడా వచ్చింది.దానితో రజిని సినిమాలను మనవాళ్ళు కూడా కాస్త పక్కన పెట్టడం మొదలు పెట్టారు.”కబాలి” తర్వాత వచ్చిన ఏ చిత్రం కూడా రజినీ స్టామినాను మ్యాచ్ చెయ్యలేకపోయింది.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన “2.0”, గత ఏడాది సంక్రాంతికి వచ్చిన “పేట” కూడా జస్ట్ ఓకే గా ఉండడం మరింత మైనస్ అయ్యింది.

వాటి మూలంగా మన దగ్గర రజినీ సినిమాలకు ఒకప్పుడు ఉన్నంత క్రేజ్ కానీ హైప్ కానీ రావడం లేదు.అదే ఇప్పుడు మురుగదాస్ దర్శకత్వంలో నటించిన “దర్బార్” చిత్రానికి వేటు వేసేలా ఉంది.టీజర్ మరియు ట్రైలర్స్ లో రజినీ తనదైన స్టైల్ మరియు పెర్ఫామెన్స్ లతో ఆకట్టుకున్నా సరైన ప్రమోషన్స్ లేకపోవడం మూలంగా బుకింగ్స్ ఊహించిన స్థాయిలో జరగడం లేదు.దీనితో ఫస్ట్ డే మాత్రం రజిని మార్క్ మ్యాజిక్ ఫిగర్స్ రావడం కష్టమే అని చెప్పాలి.