‘దర్బార్’ సినిమా చూడటానికి 5 కారణాలు…డోంట్ మిస్

సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. తలైవా అభిమానులతో పాటు సగటు సినీ ప్రేమికుడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘దర్బార్’ మూవీ మరికొన్ని గంటల్లో వెండితెరపై దర్శనమీయనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అయితే, రేపు థియేటర్‌కు వెళ్లి ఈ సినిమా చూడాలా అని కొంత మందికి అనిపించొచ్చు. అలాంటి వారి కోసం అసలు ఈ సినిమా ఎందుకు చూడొచ్చు అనడానికి మేం ఐదు కారణాలు చెబుతున్నాం.

సూపర్ స్టార్ రజినీకాంత్
ఈ సినిమా కచ్చితంగా చూడొచ్చు అనడానికి ప్రధాన కారణం రజినీకాంత్. చాలా సంవత్సరాల తరవాత రజినీకాంత్ పోలీస్ అధికారిగా నటించడం మరో ఆకర్షణ. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో రజినీ అదరగొట్టారు.

నయనతార
‘చంద్రముఖి’ (2005) లాంటి బ్లాక్ బస్టర్ తరవాత రజినీకాంత్, నయనతార జంటగా నటించిన చిత్రం ‘దర్బార్’. ఈ సినిమాలో నయనతార గతంలో కన్నా అందంగా ఉంటుందని ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రజినీకాంత్ చెప్పారు.

ఎ.ఆర్.మురుగదాస్
ఎ.ఆర్.మురుగదాస్ ఎంత ప్రతిభ కలిగిన దర్శకుడో కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు ఊహించిన స్థాయిలో ఆడలేదు. సినిమా ఔట్‌పుట్‌పై మురుగదాస్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. బ్లాక్ బస్టర్ కొడతాననే నమ్మకంతో ఉన్నారు.

సంగీతం, సినిమాటోగ్రఫీ
రజినీకాంత్ గత చిత్రం ‘పేట’కు అనిరుధ్ రవిచందర్ అద్భుతమైన నేపథ్య సంగీతం, పాటలు అందించారు. ‘దర్బార్’కు కూడా అనిరుధ్‌ను తీసుకోవడంతో ఫ్యాన్స్ అంచనాలు భారీగానే పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలన్నీ శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇక సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ మరో ప్రధాన ఆకర్షణ కానుంది. ఈ సినిమాలో రజినీకాంత్‌ను చాలా కలర్‌ఫుల్‌గా, స్టైలిష్‌గా చూపించారాయన. ఈ విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

కథ,కధనం
ఇటీవల ప్రమోషన్స్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన దర్శకుడు మురుగదాస్ ‘దర్బార్’ కథను సూచన ప్రాయంగా చెప్పారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటన మాదిరిగా తన సినిమా కథ ఉంటుందని అన్నారు. దీన్ని బట్టి పోలీస్ ఆఫీసర్‌గా రజినీ పాత్ర ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాల ఇతివృత్తంతో అదిరిపోయే ట్విస్టులతో ఈ సినిమా కథనం సాగుతుంది.