దర్భార్ సినిమాకి ర‌జ‌నీ పారితోషికం తెలిస్తే షాక్ అవుతారు

దేశంలోనే అత్య‌ధిక పారితోషికం తీసుకునే క‌థానాయిక‌ల్లో ర‌జ‌నీకాంత్ స్థానం ముందు వ‌రుస‌లో ఉంటుంది. 70 ఏళ్లు దాటినా ర‌జ‌నీ క్రేజ్‌, అత‌ని డిమాండ్ ఏమేర‌కూ త‌గ్గ‌లేదు. వ‌రుస‌గా ఫ్లాపులిచ్చినా స‌రే, ర‌జ‌నీ సినిమా అంటే బ‌య్య‌ర్లు వ‌రుస క‌డ‌తారు. కొబ్బ‌రికాయ కొట్ట‌క‌ముందే బిజినెస్ మొద‌లైపోతుంది. `ద‌ర్బార్` ప్రీరిలీజ్ బిజినెస్ జ‌రిగిన విధాన‌మే అందుకు సాక్ష్యం.

విడుద‌ల‌కు ముందే ఈ సినిమా లాభాల్లో ఉంది. ఈ సినిమాకి గానూ ర‌జ‌నీ అందుకున్న పారితోషికం కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ చిత్రానికి ర‌జ‌నీ అక్ష‌రాలా 108 కోట్లు అందుకున్నాడ‌ని తెలుస్తోంది. బాలీవుడ్ లోనూ ఇంత పారితోషికం తీసుకుంటున్న క‌థానాయ‌కుడు లేడంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. అన్న‌ట్టు ఈ సినిమాకి గానూ మురుగదాస్ రూ.30 కోట్లు అందుకున్నాడ‌ట‌. న‌య‌న‌తార‌కీ భారీగానే గిట్టుబాటు అయ్యింది. త‌మిళ‌నాట ఈ సినిమా వ‌సూళ్లు ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల‌లోనూ తొలిరోజు మంచి వ‌సూళ్లే అందుకున్నాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌గ‌ట్టాయి.