కలబందతో ఎన్ని లాభాలో తెలిస్తే ఇక వదలరు…

కలబంద.. పెరటింటి దివ్యౌషధం. ఒకసాటి నాటి వదిలేస్తే చాలు దానంత అదే బతికేసే ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చ‌ర్మ సంబంధ‌మైన రోగాల‌కు, కాలిన, తెగిన‌ గాయాల‌కు ఇది చక్కని పరిష్కారం అంతేకాకుండా జీర్ణ సమస్యలను ఇది తొలగిస్తుంది. క‌ల‌బంద గుజ్జును చాలామంది చర్మ సందర్యం కోసం వాడుతుంటారు. అయితే దీన్ని పలు ఆరోగ్య సమస్యలకు మందుగానూ వాడొచ్చు.

కలబంద వలన ఉపయోగాలు :

జీర్ణవ్యవస్థలో పేరుకు పోయిన వ్యర్థ, విష పదార్థాలను బయటకు పంపుతుంది.

ఉదయాన్నే పరగడుపున కలబంద ఆకును తింటే, కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధులను మటుమాయం చేస్తుంది.

కలబంద గుజ్జు మధుమేహం, కీళ్ళనొప్పులు, జీర్ణకోశ, స్త్రీ సంబంధమైన వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

కలబంధ గుజ్జుతో తయారైన జ్యూస్‌ను తాగడం వలన దీర్ఘకాలం ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.

శరీరం కాలిన చోట కలబంద రసం వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుంది.

కలబంధ అటు తరుణ వ్యాధులకు, ఇటు దీర్ఘ వ్యాధులకు కూడా అమోఘంగా పనిచేస్తుంది.

తల వెంట్రుకలకు, చర్మ సౌందర్యం కోసం :

కలబంద గుజ్జుకు తగినంత పసుపును జోడించి ముఖానికి ఫేషియల్‌ చేసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంపై పేరుకున్న మురికి తొలగిపోయి ముఖం కాంతివంతం అవుతుంది.

కలబంద ఆకురసంతో నల్లమచ్చలు పోగొట్టవచ్చు.