రూటు మార్చిన అల్లరి నరేష్…ఇప్పటికైనా హిట్ దక్కేనా…???

ఈసారి విభిన్నమైన కథతో, విలక్షణమైన పాత్రను అల్లరి నరేశ్ ఎంచుకున్నారు. కొంతసేపటి క్రితం వదిలిన ‘నాంది’ ఫస్టులుక్ పోస్టర్ ను చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. కొంతసేపటి క్రితమే ఈ సినిమాను హైదరాబాద్ – రామానాయుడు స్టూడియోలో లాంచ్ చేశారు. దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ ఇవ్వగా, ముహూర్తపు సన్నివేశాన్ని అల్లరి నరేశ్ పై చిత్రీకరించారు.

సతీశ్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా, విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకమైన పాత్రను పోషిస్తోంది. హరీశ్ ఉత్తమన్ .. ప్రియదర్శి .. ప్రవీణ్ .. వినయ్ వర్మ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇంతవరకూ 56 సినిమాలను పూర్తి చేసిన అల్లరి నరేశ్, ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని భావిస్తున్నాడు.

error: Content is protected !!