డిస్కో రాజా సెన్సార్ రివ్యూ…హిట్ పక్కా…!

రవితేజ హీరోగా, విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సినిమా డిస్కో రాజా. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాలో నాభా నటేష్ , పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్లుగా నటించారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా ప్రీరీలాస్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ….. ‘ప్రేక్షకులందరూ బాగా ఎంజాయ్ చేసే సినిమా డిస్కో రాజా. ఈ సినిమా చేస్తున్నప్పుడే బాగా ఎంజాయ్ చేస్తూ చేశాను. విఐ ఆనంద్ సినిమాను బాగా తీశాడు. వెన్నెల కిషోర్, సునీల్, బాబీ సినిమాతో బెస్ట్ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్. ఈ సినిమాలో ఉన్న ముగ్గురు హీరోయిన్స్ బాగా చేశారు. కెమెరామెన్ కార్తీక్ ఘట్టమనేని బాగా చేశాడు.

నేను చూస్తూ పెరిగిన పాత్రలు ఈ సినిమాలో చేశాను. అందరికి నచ్చుతాయి. తమన్ మంచి సాంగ్స్ ఇచ్చాడు. రామ్ తల్లూరితో చేసిన ఈ రెండో సినిమా నిరుత్సాపరచడము. జనవరి 24న మీలాగే నేను ఈ సినిమా కోసం వేచి చూస్తున్నాను’ అని అన్నారు.

ఒకే తరహా కథలు, పాత్రలు వస్తుండడంతో, కొత్తదనం కోసం రవితేజ కొంత గ్యాప్ తీసుకున్నాడు. వైవిధ్యభరితమైన కథ అనిపించడంతో అయన డిస్కో రాజా సినిమాని అంగీకరించాడు. విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ మంజూరు చేసింది. ముందుగా చెప్పినట్లుగానే ఈ సినిమాను ఈనెల 24న విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంలో నటిస్తుండగా, అయన సరసన నభా నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్యా హాప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముఖ్యమైన పాత్రల్లో సునీల్, వెన్నెల కిషోర్ కనిపించనున్నారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాకి తమన్ అందించిన సంగీతం ప్రత్యేకంగా నిలవనుందని అంటున్నారు. ఈ సినిమాపై రవితేజ పెట్టుకున్న ఆశలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

error: Content is protected !!