యూఎస్ లో అల్లు అర్జున్, మహేష్ స్టామినా…ఎవరిదీ పైచేయి…???

సంక్రాంతి బరిలో నిలిచిన రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలు సరిలేరు నీకెవ్వరూ, అలా వైకుంఠపురంలో. ఈ చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. అయితే సంక్రాంతికి యూఎస్ లో తెలుగు సినిమాలకు ఆదరణ ఎక్కువ. ఏ చిత్రం అయినా దాని స్టామినా ఏంటనేది విదేశాల వసూళ్లతో తెలుస్తుంది. అయితే మహేష్, అల్లు అర్జున్ చిత్రాలకు సంబంధించి ఇప్పటివరకు యూఏస్ లో సరిలేరు నీకెవ్వరూ చిత్రం 14.96 కోట్ల రూపాయల్ని వసూలు చేయగా, అలా వైకుంఠపురంలో 20.16 కోట్ల రూపాయల్ని వసూలు చేసింది.

సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన రెండు సినిమాలతో పాటుగా దర్బార్ చిత్రం కూడా ఆశించదగ్గ వసూళ్ళని రాబట్టి బాక్సఫీస్ వద్ద తన తడాఖాని చూపిస్తుంది. అయితే ప్లాపులతో సతమవుతున్న అల్లు అర్జున్ కి అలా వైకుంఠపురంలో చిత్రం మంచి ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పాలి.

error: Content is protected !!