ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్‌…క్లారిటీ ఇచ్చిన కృష్ణంరాజు

ప్ర‌భాస్ అభిమానుల‌కు ఓ చేదువార్త‌. 2020లో ప్ర‌భాస్‌ని వెండి తెరపై చూడ‌లేం. ఎందుకంటే ఆయ‌న న‌టిస్తున్న కొత్త చిత్రం 2020లో రాద‌ట‌. 2021 వేస‌విలో విడుద‌ల చేస్తార‌ట‌. ఈ విష‌యాన్ని కృష్ణంరాజునే స్వ‌యంగా వెల్ల‌డించారు. రాధాకృష్ణ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్ర నిర్మాణంలో కృష్ణంరాజు కూడా పాలు పంచుకున్నారు. ఆయ‌నే విడుద‌ల తేదీపై ఓ క్లారిటీ ఇచ్చారు. 2020 చివ‌రి నాటికి సినిమా పూర్త‌వుతుంద‌ని, 2021 వేస‌విలో విడుద‌ల చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అంటే 2020లో ప్ర‌భాస్ సినిమా రాద‌న్న‌మాట‌.

నిజానికి 2019లో రాధాకృష్ణ సినిమా కూడా వ‌స్తుంద‌నుకున్నారు. కానీ షూటింగ్‌లో జాప్యం వ‌ల్ల‌.. అది కుద‌ర్లేదు. సాహో రిజ‌ల్ట్ త‌ర‌వాత లెక్క‌లు మారిపోయాయి. జాన్ క‌థ విష‌యంలో ప్ర‌భాస్ చాలా జాగ్ర‌త్త ప‌డ్డాడు. దాంతో క‌థ మారింది. తీసిన స‌న్నివేశాల్ని ప‌క్క‌న పెట్టాల్సివ‌చ్చింది. కొత్త‌గా స్క్రిప్టు రాశారు. అందుకే… ఇప్పుడు సినిమా విడుద‌ల మ‌రింత ఆల‌స్యం అవుతోంది. 2021లో గానీ ఈ సినిమా రావ‌డం వీలు కాదంటే.. ఏ మేర రీషూట్లు చేస్తున్నారో ఊహించుకోవొచ్చు.

error: Content is protected !!