Movies

అలీ ఆస్తి గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే…ఎన్ని కోట్లు సంపాదించాడో … ?

తెలుగు కమెడియన్స్ లో అలీకి ఒక ప్రత్యేక స్టైల్ ఉంది. చిన్నప్పుడే బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి,స్టార్ కమెడియన్ గా ఎదిగిన అలీ హీరోగా కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. వందలాది సినిమాల్లో హాస్య నటుడిగా చేయడమే కాకుండా,బుల్లితెరపై కూడా స్టేజ్ షోలు చేస్తూ తనదైన ముద్రవేసాడు.

ఎస్వీ కృష్ణారెడ్డ్డి డైరెక్షన్ లో యమలీల మూవీ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అప్పట్లో అలీ ఏంటి హీరో ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. అంతగా జనంలోకి దూసుకుపోయింది ఆ సినిమా. తర్వాత కొన్ని హీరో పాత్రలు చేసినా సక్సెస్ రాకపోవడంతో మళ్ళీ కమెడియన్ గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే తనకు వచ్చే డబ్బుల్లో ఎంతోకొంత నిరుపేదలకు వితరణ చేసే గుణం ఆలీకి ఉంది.

అయితే అలీ ఏడాదికి ఎంత సంపాదిస్తాడు, అతడి ఆస్తి ఎంత, ఒక్కొక్క సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడు వంటి విషయాల్లోకి వెళ్తే,ఇతడి ఆస్థి 125కోట్ల రూపాయలు. ఏడాదికి 8నుంచి 10కోట్లు రూపాయలు నటుడిగా సంపాదన ఉంటుంది. ఒక్కొక్క సినిమాకు కోటి నుంచి 2కోట్లు డిమాండ్ చేస్తాడట. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో రెండు కోట్లు విలువచేసే ఇల్లుంది. ఒక సూపర్ లగ్జరీ కారు మెయింటేన్ చేస్తున్నాడు.