“సాహో” తీర్చని లోటు ప్రభాస్ జాన్ తీర్చబోతుందా.?
టాలీవుడ్ డార్లింగ్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం “సాహో” అయితే నటిస్తున్న చిత్రం “జాన్”(అనధికారిక టైటిల్). అయితే డార్లింగ్ దశ బాహుబలి తర్వాత ఏ లెక్కలో తిరిగిందో వేరే చెప్పనక్కర్లేదు.ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఉన్నన్ని నాళ్ళు డార్లింగ్ ప్రభాస్ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది.అయితే బాహుబలి ఇచ్చిన పేరును నిలపడానికి ఆ తర్వాత ప్రభాస్ తో ప్రాజెక్ట్ ను టేక్ చేసిన దర్శకులు కూడా గట్టిగానే కష్టపడుతున్నారు.
అలా సుజీత్ “సాహో”ను అత్యున్నత ప్రమాణాలతో బిగ్గెస్ట్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు.ఫలితం సరిగ్గా రాకపోయినా వసూళ్లు మాత్రం గట్టిగానే రాబట్టారు.అయితే ఈ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ప్రభాసే అని చెప్పాలి.ప్రభాస్ లుక్స్ విషయంలో చాలా అశ్రద్ధ తీసుకున్న విషయం చాలా సుస్పష్టంగా ఈ చిత్రంలో కనిపిస్తుంది.కేవలం పాటలు మినహా డార్లింగ్ లుక్స్ అభిమానులకే నచ్చలేదు.
అయితే ఈ లోటును ఇప్పుడు తన తర్వాత చిత్ర దర్శకుడు రాధాకృష్ణ తీరుస్తారు అనిపిస్తుంది.ఎందుకంటే రీసెంట్ గా బయటకొస్తున్న ప్రభాస్ ఫోటోలు చూసినట్లయితే ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ లుక్స్ లో కనిపిస్తున్నారు.పేస్ కట్స్ మరియు ఫిట్ నెస్ ను బాగా మైంటైన్ చేస్తున్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది.ఈ ఫోటోలు చూసి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కాస్త హ్యాపీ ఫీల్ అవుతున్నారు.సో ప్రభాస్ 20 నుంచి మనం మంచి లుక్స్ ను ఆశించవచ్చు.