ఆ కాలంలో సినిమాలు చేసే హీరోయిన్స్ ఎన్ని ఇబ్బందులు పడేవారో తెలుసా?
ప్రస్తుత సభ్య సమాజంలో ఆడవారి పట్ల ఉన్న వివక్షతలు,వారిపై జరుగుతున్న ఘటనలు నిస్సహాయ స్థితిలో మనం చూస్తూనే ఉన్నాము.ఇంకో విధంగా చెప్పాలి అంటే ఇవి అలవాటు అయ్యిపోయాయి.సినిమాల్లో చూపించిన విధంగా అప్పటికప్పుడు ఎవరొకరు వచ్చి ప్రక్షాళన చేస్తే తప్ప ఏదొక ముగింపు రాదు.
అయితే సినీ ఇండస్ట్రీలో కూడా ఆడవారు ఎదుర్కొన్న చేదు ఘటనలు అనుభవాలు కూడా ఉన్నాయి.కానీ అదే సినిమాలు చెయ్యడం మూలాన 1970ల కాలంలో ఆడవారు తమ వైవాహిక జీవితానికి సంబంధించి ఎలాంటి పరిస్ధితులు ఎదుర్కొన్నారో అలనాటి నటి రాజశ్రీ “ఆలీతో సరదగా” షో ద్వారా పంచుకున్నారు.వచ్చే వారం టెలికాస్ట్ కాబోయే ఈ ఎపిసోడ్ తాలూకా ప్రోమో బయటకు వచ్చింది.
ఆ రోజుల్లో సినిమాలు చేసే ఆడవాళ్లంటే కాస్త చిన్న చూపు ఉండేది అని సినిమాల్లో నటించే ఆడవాళ్లకు పెళ్లి చెయ్యాలి అంటే కట్నం ఎక్కువ అడిగేవారని కాస్త ఎమోషన్ అయ్యి చెప్పారు.1956లో సినీ తెరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయిన రాజశ్రీ గారు “దానవీరసూరకర్ణ”, “అల్లూరి సీతారామరాజు”, “శ్రీ రామాంజనేయ యుద్ధం”, “లక్ష్మీ కటాక్షం” వంటి ఎన్నెన్నో చిత్రాల్లో నటించారు.