Movies

RRR లో స్టార్ హీరోయిన్…ఆ లక్కీ ఛాన్స్ కొట్టిన భామ ఎవరో తెలుసా?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి వార్త వచ్చినా వదలకుండా ఫాలో అవుతున్నారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో చరణ్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోండగా, తారక్ సరసన ఫారిన్ ముద్దుగుమ్మ నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఆయనకు జోడీగా ఈ సినిమాలో మరో హీరోయిన్‌ను జక్కన్న అండ్ టీమ్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ సరసన శ్రియా సరన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

అజయ్ దేవ్గన్ వంటి సీనియర్ నటుడికి జోడీగా శ్రియా లాంటి హీరోయిన్ అయితేనే బాగుంటుందని చిత్ర యూనిట్ ఆమెను తీసుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం వికారాబాద్‌లో షూటింగ్ జరుగుతున్న ఆర్ఆర్ఆర్‌లో అజయ్ దేవ్గన్‌తో కలిసి ఆమె పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.