నువ్వొస్తానంటే నేనొద్దంటానా పనిమనిషి పాత్రలో నటించిన సంతోషి ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
సినీ ఇండస్ట్రీ అయినా, టివి ఇండస్ట్రీ అయినా అందులో ప్రవేశించడానికి చేసే ప్రయత్నం ఒక ఎత్తయితే,అందివచ్చిన ఛాన్స్ లను ఆసరాగా చేసుకుని నిలదొక్కుకోవడం మరో ఎత్తు. అందుకే అందరూ సక్సెస్ కాలేరు. ఇక కొందరైతే ఒకటి రెండు పాత్రలు చేసి,ఆతరవాత దూరంగా జరిగినా,వాళ్ళు చేసిన పాత్రలు వాళ్ళను జనం మదిలో నిలబెడతాయి. అలాంటి వారిలో నటి సంతోషిణి ని ప్రస్తావించాలి.
జై సినిమాతో టాలీవుడ్ లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఏంట్రీ ఇచ్చిన సంతోషిణి కి ఆతర్వాత హీరోయిన్ గా ఛాన్స్ లు రాలేదు. అయితే నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో పనిపనిషి పాత్రలో సైతం నటించి మెప్పించింది. జాగ్రత్త అనగానే చేతిలో ఉన్నవన్నీ కిందకి పడేసే పాత్రతో అందరినీ ఆకట్టుకుంది. ఆతర్వాత శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన ఢీ మూవీలో పనిమనిషి క్యారెక్టర్ చేసి అందరిని మరోసారి ఆకట్టుకుంది.
అయితే ఆతర్వాత పెద్దగా ఛాన్స్ లు రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి, శ్రీకర్ అనే వ్యక్తిని 2011లో పెళ్లి చేసుకుంది. ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూనే మరోవైపు చెన్నైలో బ్యూటీ పార్లర్ నడుపుతూ బెస్ట్ మేకప్ ఆర్టిస్టుల్లో ఒకరిగా పేరుపొందింది. వెడ్డింగ్ డిజైనర్ పేరిట డిజైనర్ గా కూడా రాణిస్తోంది.