తెలుగు టాప్ 10 యాంకర్స్-టాప్ సీక్రెట్స్

బుల్లితెర వచ్చాక సినీ సెలబ్రిటీల తర్వాత సెలబ్రిటీలంటే టివి యాంకర్స్ గురించే చెప్పాలి.1990దశకం తర్వాత ఆడియో ఫంక్షన్స్,టివి షోస్ ద్వారా పాపులార్టీ తెచ్చుకున్న వాళ్ళు అప్పుడే కాదు,ఇప్పుడు కూడా సెలబ్రిటీలుగానే ఉన్నారు. అందుకే అప్పట్లో యాంకరింగ్ చేసిన ముద్దుగుమ్మలు క్రేజ్ బాగా సంపాదించారు. కొందరైతే ఇంకా సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. కొందరు వేగంగా సక్సెస్ అందుకుని తెరమరుగయ్యారు. మహారాష్ట్రకు చెందిన సౌమ్య అందంతోపాటు తెలుగు,హిందీ,తదితర భాషల్లో రాణించింది. వీడియో జాకీగా 2008లో కెరీర్ ప్రారంభించి,పలు ప్రోగ్రామ్స్ చేస్తూ సినిమాల్లో కూడా నటించింది. జి తెలుగులో గంగతో రాంబాబు సీరియల్ తో ఆడియన్స్ కి దగ్గరైంది.

1985లో ఏలూరులో పుట్టిన జాహ్నవి జెమినిలో డాన్స్ బేబీ డాన్స్ లో టైటిల్ విన్నర్ అయింది. అప్పట్లో జెమినిలో చేసే యాంకరింగ్ ప్రోగ్రాం అన్నీ హిట్ అయ్యాయి. ఇక 2004లో యజ్ఞం మూవీలో కామెడీ పండించి ఆకట్టుకుంది. ప్రముఖ దర్శకుడు రసూల్ ని పెళ్లాడాక బుల్లితెరకు,వెండితెరకు దూరమైంది. 1980లో పుట్టిన అనితా చౌదరి నటిగా, యాంకర్ గా ఓ వెలుగు వెలిగింది. ఇంటర్ చదివేటప్పుడే యాంకర్ గా వచ్చి,కౌంట్ డౌన్ ,పబ్లిక్ డిమాండ్ షోస్ తో మంచి పేరు తెచ్చుకుంది. కస్తూరి డైలీ సీరియల్ చేసి రికార్డ్ క్రియెట్ చేసింది. 30కి పైగా సినిమాల్లో చేసింది. పరుగు,అమ్ము,లయన్ వంటి మూవీస్ లో నటించిన రాణి చిత్రలేఖ యాంకర్ గా, సీరియల్ నటిగా, రచయితగా, టివి ప్రోగ్రామ్స్ నిర్వహణ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది.

హరితేజ నటి అయ్యాక యాంకర్ గా రాణిస్తోంది. పలు టివి సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకుని యాంకర్ గా దుమ్మురేపుతోంది. దివంగత బాపు మనవరాలు గాయత్రీ భార్గవి యాంకర్ గా,మోడల్ గా మంచి పేరుతెచ్చుకుంది. ఓ మిలట్రీ ఆఫసర్ ని పెళ్లాడింది. అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తోంది. కలకత్తాకు చెందిన శిల్పా చక్రవర్తి తల్లిదండ్రులు రైల్వేలో ఉద్యోగ రీత్యా సికింద్రాబాద్ లో స్థిరపడ్డంతో తెలుగు బాగా మాట్లాడుతూ యాంకరింగ్ అదరగొట్టేది. ఇక అందరికీ తెలిసిన ఉదయభాను యాంకరింగ్ తో ,సినీ నటిగా ,టివి షోస్ ద్వారా తన సత్తా చాటింది. అందం,అభినయం తో బుల్లితెరపై యాంకరింగ్ తో ఓ ఊపు ఊపేసింది. ఝాన్సీ 1994లో టివి యాంకర్ గా పరిచయమై ఆడియన్స్ కి దగ్గరైంది.

సినిమాల్లో కూడా నటించి తన సత్తా చాటింది. ఇప్పటికీ ఆడియో ఫంక్షన్స్ లో ఆమె తనదైన యాంకరింగ్ తో రాణిస్తోంది. ఇక యాంకర్ సుమ మలయాళీ అయినప్పటికీ తెలుగు చక్కగా మాట్లాడుతూ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. 45ఏళ్ళ వయస్సులో కూడా అదరగొడుతోంది. తెలుగు అబ్బాయి రాజీవ్ కనకాల ను పెళ్లాడింది. రెండు దశాబ్దాలుగా పలు షోస్ తో తెలుగు బుల్లితెరను ఏలుతోంది. సినిమాల్లో కూడా నటించింది. మంచి గాయని కూడా.